Healthhealth tips in telugu

ఆపిల్ జ్యూస్ Vs లెమన్ జ్యూస్… ఏది తాగితే ఆరోగ్యానికి మంచిది…నమ్మలేని నిజాలు

Apple Juice Vs Lemon Juice Benefits : ఆపిల్ మరియు నిమ్మకాయ రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆపిల్ శరీరంనకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాకుండా కాపాడితే…నిమ్మరసం శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతుంది. శరీరంలో వ్యర్ధాల కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి.

లెమన్ జ్యూస్ లో కంటే ఆపిల్ జ్యూస్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ఆపిల్ జ్యూస్ లో 46 కేలరీలు ఉంటే…అదే నిమ్మరసంలో 22 కేలరీలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు విషయానికి వస్తే ఆపిల్ జ్యూస్ లో లెమన్ జ్యూస్ కంటే 64% ఎక్కువ. కొవ్వు విషయానికి వస్తే లెమన్ జ్యూస్ లో ఆపిల్ జ్యూస్ కంటే 85% ఎక్కువ.

డైటరీ ఫైబర్ విషయానికి వస్తే లెమన్ జ్యూస్ లో ఆపిల్ జ్యూస్ కంటే 50% ఎక్కువ. ప్రోటీన్ విషయానికి వస్తే లెమన్ జ్యూస్ లో ఆపిల్ జ్యూస్ కంటే 250% ఎక్కువ. నీరు విషయానికి వస్తే లెమన్ జ్యూస్ లో ఆపిల్ జ్యూస్ కంటే 5% ఎక్కువ. ఆపిల్ జ్యూస్ తాగటం వలన శరీరంలోని రక్తనాళాలు మరియు ధమనులలో కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Apple Tea benefits
జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసి జీర్ణప్రక్రియ బాగా సాగేలా చేయటమే కాకుండా బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. మెదడు చురుగ్గా ఉండేలా చేసి వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గించి మతిమరుపు లేకుండా చేస్తుంది. విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఉండవు.

ఇక లెమన్ జ్యూస్ విషయానికి వస్తే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. మెటబాలిజంను పెంచి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. తలనొప్పి, నిరుత్సాహం వంటివి లేకుండా ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
lemon benefits
నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లోని రాళ్లను సైతం కరిగించగలదు. కిడ్నీలో ఏర్పడ్డ చిన్న రాళ్ల వంటి వాటిని ముక్కలుగా చేసి మన శరీరం నుంచి ఈ చిన్న రాళ్లను బయటికి పంపేలా నిమ్మరసం అద్భుతాలను చేస్తుంది. ఆపిల్ జ్యూస్,లెమన్ జ్యూస్ రెండూ కూడా మన ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.