1 గ్లాస్ తలనొప్పి,అలసట,నీరసం,శారీరక బలహీనత అన్నింటిని మాయం చేస్తుంది
Headache Home Remedies In Telugu : మనలో చాలా మంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సాదరణంగా మనలో చాలా మంది తలనొప్పి,అలసట, శారీరక బలహీనత వంటి సమస్యలతో తరచుగా బాధపడుతూ ఉంటారు. అలా సమస్య రాగానే మందుల షాప్ కి వెళ్ళి మందులను తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు.

అలా కాకుండా ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఒక మిక్సీ జార్ లో 20 నల్ల మిరియాలు, 250 గ్రాముల పటికబెల్లం, 25 యాలకులు, 100 గ్రాముల సొంపు, 2 స్పూన్ల గసగసాలు వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని సీసాలో నిల్వ చేస్తే దాదాపుగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు.

ప్రతి రోజు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీటిలో ఒక స్పూన్ పొడిని కలిపి తాగాలి. రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు. ఇలా తాగటం వలన తలనొప్పి,అలసట,నీరసం, నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉంటారు. అలాగే శారీరక బలహీనత కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ పొడిని తయారుచేసుకొని తాగితే ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు.

జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి సీజనల్ గా వచ్చే సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి గంట ముందు తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అన్నీ సహజసిద్దమైన పదార్ధాలు వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే చాలా తక్కువ ఖర్చుతో సమస్య నుండి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

