Healthhealth tips in telugu

గొంతునొప్పి, జలుబు, దగ్గును కేవలం 2 నిమిషాల్లో మాయం చేసే అద్భుతమైన చిట్కా ఇదే!

cough and cold home remedies In telugu: వాతావరణం మారగానే జలుబు, గొంతు నొప్పి, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? హాస్పిటల్స్, సిరప్‌ల చుట్టూ తిరిగే పని లేకుండా, మన వంటగదిలో ఉండే సహజసిద్ధమైన వస్తువులతో కేవలం 2 నిమిషాల్లో ఈ సమస్యల నుండి తక్షణ ఉపశమనం ఎలా పొందాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

గొంతులో గరగర ఉంటే వెంటనే మనం విక్స్ వేసుకుంటూ ఉంటాం. కానీ దానివల్ల సమస్య తగ్గదు. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే గొంతులో గర గర, గొంతు నొప్పి,గొంతు ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు పూర్తిగా తగ్గిపోతాయి. దీనికోసం ఒక టీ తయారు చేసుకోవాలి.

టీ తయారుచేసుకోవటం చాలా సులువు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. రాత్రి సమయంలో నాలుగు బాదం పప్పులను నీటిని పోసి నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయం బాదంపప్పులపై తొక్క తీసి మిక్సీ జార్లో వేయాలి. ఆ తర్వాత ఐదు మిరియాలు. రెండు గింజలు తీసిన ఖర్జూరాలు. అరకప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి. .

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత పావు స్పూన్ లో సగం పసుపు వేసి రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. ఈ పాలను రోజులో ఒకసారి తీసుకుంటే గొంతు నొప్పి, గొంతులో గరగర, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి.

ముఖ్యంగా ఈ సీజన్లో శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ పాలు చాలా బాగా సహాయపడతాయి. ఏ సమస్యలు లేని వారు ఈ పాలను వారంలో రెండు సార్లు తీసుకుంటే సీజనల్ గా వచ్చే వ్యాధులు ఏమి రావు. కాబట్టి కాస్త ఓపికగా ఈ పాలను తయారు చేసుకుని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఈ పాలల్లో మనం ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ లో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించటానికి ఈ పాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ పాలు అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."