Healthhealth tips in telugu

దానిమ్మ పండు కంటే ఆకుల్లోనే అసలైన పవర్.. ఈ రహస్యం తెలిస్తే ఇక వాటిని వదిలిపెట్టరు!

pomegranate leaves benefits In Telugu : దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. కానీ, దానిమ్మ ఆకులలో (Pomegranate leaves) దాగున్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఎవరికీ పెద్దగా తెలియవు.

జీర్ణ సమస్యలను దూరం చేయడం నుంచి, రోగనిరోధక శక్తిని పెంచి ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో ఈ ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అసలు దానిమ్మ ఆకులను ఎలా ఉపయోగించాలి? వీటి వల్ల కలిగే ఊహించని ప్రయోజనాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

దానిమ్మ పండులో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దానిమ్మ ఆకులో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. దానిమ్మ ఆకును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.
Best home remedy for Mouth Ulcers in Telugu
దానిమ్మ ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. నోటి పూత ఉన్నప్పుడు దానిమ్మ ఆకుల రసంను నోట్లో పోసుకొని పుక్కిలించాలి. ఇలా చేస్తే నోటి పూత నుండి ఉపశమనం కలుగుతుంది. దానిమ్మ ఆకులు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు, గొంతునొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసు నీటిని పోసి పది దానిమ్మ ఆకులను వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగితే దగ్గు నుండి ఉపశమనం మరియు గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

దానిమ్మ ఆకుల కాషాయన్ని రాత్రి పడుకొనే ముందు తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో దానిమ్మ ఆకుల పేస్ట్ రాస్తే తొందరగా తగ్గుతాయి. eczema ను కూడా తగ్గిస్తుంది. దానిమ్మ ఆకుల పేస్ట్ మొటిమలను తగ్గించటమే కాకుండా ఒక టోనర్ వలె పనిచేస్తుంది.

దానిమ్మ ఆకులలో ఉండే పోషకాలు మరియు ఖనిజాలు జీర్ణక్రియను ప్రేరేపించడంలో సహాయపడతాయి. దాంతో గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. దానిమ్మ ఆకుల రసాన్ని దానిమ్మ జ్యూస్ లో కలుపుకొని కూడా తాగవచ్చు. దానిమ్మ ఆకులను ఉపయోగించి ఈ ప్రయోజనాలను పొందండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."