కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎర్ర క్యాప్సికమ్ తింటే ఏమవుతుందో తెలుసా?
Red Capsicum Benefits In Telugu : ఈ మధ్య కాలంలో కిడ్నీ సమస్యలు చాలా ఎక్కువ అయ్యాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. మనం తీసుకొనే ఆహారం ద్వారా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. అధిక రక్తపోటు కారణంగా కూడా కిడ్నీల పనితీరు తగ్గుతుంది.

ఎర్ర క్యాప్సికమ్ కిడ్నీల పనితీరుకు సహాయపడుతుంది. ఎర్ర క్యాప్సికమ్ లో విటమిన్లు ఎ, సి, బి6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన కిడ్నీల ఆరోగ్యంలో సహాయపడుతుంది. అలాగే లైకోపీన్ ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్, ఇది మూత్రపిండాల్లో రాళ్ల చికిత్సలో సహాయపడుతుంది మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వీటిలో విటమిన్ A మరియు బీటా కెరోటిన్ సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు మెరుగుదలకు సహాయపడటమే కాకుండా కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియ రేటును పెంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. Red capsicum లో ధర్మోజెనిసిన్ ఉండుట వలన బరువును తగ్గిస్తుంది.

హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. విటమిన్ సి కూడా చాలా సమృద్దిగా ఉండుట వలన ఇనుము యొక్క సరైన శోషణకు సహాయపడుతుంది. Red capsicum లో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ప్రస్తుతం Red capsicum చాలా విరివిగానే లభ్యం అవుతున్నాయి. ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి. కాబట్టి అవకాశం ఉంటే మాత్రం Red capsicum తినటం మానకండి. వీటిని తిని ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

