Beauty TipsHealthhealth tips in telugu

వారంలో 2 సార్లు ఈ నూనె రాస్తే చాలు.. ఇక జీవితంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యే ఉండదు!

Dandruff Free Oil In Telugu :వారంలో 2 సార్లు ఈ నూనె రాస్తే చాలు.. ఇక జీవితంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యే ఉండదు.. చుండ్రు అనేది ఒక్కసారి వచ్చిందంటే అంత తొందరగా వదలదు.

చుండ్రు సమస్యను ప్రారంభంలోనే తగ్గించుకుంటే మంచిది. చుండ్రు సమస్య ఎక్కువ అయితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. చుండ్రు కారణంగా తలలో విపరీతమైన దురద., చికాకు ఉంటుంది.

అలాగే తలలో చుండ్రు ఉండటం వలన చర్మంపై మొటిమలు కూడా వస్తూ ఉంటాయి. మనలో చాలా మంది చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి ఖరీదైన షాంపూలను, నూనెలను వాడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంటిలో తయారు చేసుకున్న నూనెను వాడితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. .

ఈ నూనె తయారు చేసుకోవడం చాలా సులువు. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది. ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ జార్ లో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, రెండు స్పూన్ల గ్రీన్ టీ పౌడర్, ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ఈ గ్లాస్ జార్ కి మూత పెట్టి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో 10 నిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తరువాత పల్చని వస్త్రం సాయంతో ఆయిల్ ని వడగట్టాలి. ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపి స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ని రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి ఐదు నిమిషాలు మసాజ్ చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. .

మరుసటి రోజు ఉదయం కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది. .తెల్లజుట్టు సమస్య కూడా తొందరగా రాదు. జుట్టు కుదుళ్లకు పోషణ అందుతుంది. కాబట్టి ఈ నూనెను ట్రై చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."