Kitchenvantalu

చేతులకు వెల్లుల్లి వాసన వస్తోందా? అయితే ఈ సింపుల్ చిట్కాలతో ఇట్టే మాయం చేయండి!

Garlic Smell Remove Tips :వంటకాల్లో వెల్లుల్లి వేస్తే ఆ రుచి, సువాసన అద్భుతంగా ఉంటుంది. కానీ, వెల్లుల్లి వలిచిన తర్వాత లేదా కోసిన తర్వాత చేతులకు పట్టే ఘాటైన వాసన మాత్రం అంత త్వరగా వదిలిపోదు.

ఎన్నిసార్లు సబ్బుతో కడిగినా ఆ వాసన అలాగే ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే, మీ వంటగదిలో ఉండే కొన్ని సాధారణ వస్తువులను ఉపయోగించి ఈ వెల్లుల్లి వాసనను చిటికెలో ఎలా మాయం చేయవచ్చో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం

వెల్లుల్లి వాసన కారణంగా చాలా మంది వెల్లుల్లికి దూరంగా ఉంటారు. సాదారణంగా వెల్లుల్లి పాయను ముట్టుకున్నామంటే చేతులకు వాసన తొందరగా పోదు. అదే వెల్లుల్లిపాయను కోసామంటే ఆ వాసన అంత తొందరగా పోదు. అయితే ఈ ఇంటి చిట్కాల ద్వారా తొందరగా పోయేలా చేయవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.

వెల్లుల్లి వాసన వస్తున్న వేళ్ళను నీటి దార కింద పెట్టి స్టెయిన్లెస్ స్టీల్ చెంచాతో వేళ్ళను రుద్దాలి. ఆ తర్వాత సబ్బుతో చేతులు కడుక్కుంటే వాసన పోతుంది.

వెల్లుల్లి వాసన పోవటానికి చేతులకు కాఫీ పొడి లేదా డికాషన్ రాసుకోవాలి. ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

నిమ్మరసంలో ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమంను కొంచెం అరచేతిలోకి తీసుకోని చేతులను బాగా రుద్ది కడగాలి.

చేతులకు ఆవాల నూనెను అప్లై చేసి, సున్నితంగా రుద్ది 5 నిమిషాలు అయ్యాక చేతులను శుభ్రం చేసుకుంటే చేతుల నుండి వెల్లుల్లి వాసన పోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."