MoviesTollywood news in telugu

‘భలే భలే మగాడివోయ్’ను ఎంతమంది హీరోలు రిజెక్ట్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు!

Nani Bhale Bhale Magadivoy Movie : మతిమరుపు కాన్సెప్ట్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘భలే భలే మగాడివోయ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా, నాని కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

అయితే ఈ అద్భుతమైన ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ మొదట నాని కోసం రాసింది కాదట! నాని వద్దకు చేరడానికి ముందు ఎందరో హీరోల చేతులు మారి రిజెక్ట్ అయింది. ఇంతకీ ఈ సూపర్ హిట్ కథను మిస్ చేసుకున్న ఆ హీరోలు ఎవరు? ఎందుకు రిజెక్ట్ చేశారు? అన్న ఆసక్తికరమైన విశేషాలు ఈ పోస్ట్‌లో చదివేయండి!

మారుతి దర్సకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా ముందుగా నాని వద్దకు కాకుండా వేరే హీరోల వద్దకు వెళ్ళితే… వారు రిజెక్ట్ చేసారు. టాలీవుడ్ లో స్వశక్తితో మినిమమ్ గ్యారంటీ హీరోగా ఎదిగిన నాని అష్టా చమ్మా సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అవడంతో ఆ తర్వాత అలా మొదలైంది సినిమా చేసి హిట్ కొట్టాడు.
Tollywood Hero Nani
రాజమౌళి డైరెక్షన్లో చేసిన ఈగ సినిమా నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈగ సినిమాలో కొంతసేపే కనిపించినా తనదైన ముద్రను వేశాడు నాని. ఆ తర్వాత కొన్ని రోజులు పరాజయాలు పలకరించాయి. భలే భలే మగాడివోయ్ సినిమాను మారుతి దర్శకత్వంలో చేసి మళ్లీ హిట్ ట్రాక్ పట్టాడు. ఈ సినిమా చేశాక నానికి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.

అయితే ఈ సినిమాను మారుతి నాని కంటే ముందుగా ముగ్గురు హీరోలకు కథ వినిపించాడట. ఆ ముగ్గురు రిజెక్ట్ చేశాక నాని వద్దకు వచ్చాడట. నాని వెంటనే ఓకే చెప్పేయడం సినిమా చేయటం సినిమా హిట్ అవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ఆ ముగ్గురు హీరోలు ఎవరా అని ఆలోచిస్తున్నారా. ఎవరంటే నాగ చైతన్య, అల్లరి నరేష్, సునీల్. ఈ ముగ్గురు రిజెక్ట్ చేసిన సినిమాను నాని చేసి హిట్ కొట్టాడు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."