Weight Loss Tips:ఈ పొడిని నీటిలో కలిపి తాగితే ఎంత లావుగా ఉన్నా సన్నగా మారతారు
Weight Loss Drink In Telugu : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, మారిన జీవనశైలి, ఎక్కువసేపు అలా కూర్చుని ఉండిపోవడం, శారీరిక శ్రమ లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా బరువు తగ్గాలి. బరువు తగ్గటానికి ఇప్పుడు చెప్పే పొడిని ప్రతి రోజు ఒక గ్లాసు గోరువెచ్చ నీటిలో కలిపి తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు. ఈ పొడిని చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.

పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అర కప్పు సోంపు, 15 యాలకులు, ఒకటిన్నర స్పూన్ల లవంగాలు, అర స్పూన్ మిరియాలు, అంగుళం దాల్చిన చెక్క, చిన్న ములేటి ముక్క వేసి మంచి వాసన వచ్చేవరకు వేగించాలి. బాగా వేగిన వీటిని కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల శొంటి పొడి, అర స్పూన్ జాజికాయ పొడి వేసి మరోసారి మిక్సీ చేసుకోవాలి.

ఈ పొడిని ఒక గాజు సీసాలో పోసి నిలువ చేసుకుంటే నెలరోజుల పాటు వాడుకోవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ పొడి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ నీటిని తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే 15 రోజుల్లోనే తేడా గమనించి చాలా ఆశ్చర్యపోతారు. శరీరంలో వర్గాలను బయటకు పంపుతుంది.

శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అలాగే సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గించటానికి కూడా ఈ పొడి సహాయపడుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఈ పొడిని తయారుచేసుకొని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

