MoviesTollywood news in telugu

Ram మిస్ చేసుకున్న సినిమాలు ఎన్ని ఉన్నాయో చూడండి

Tollywood Hero Ram Pothineni : రామ్ పోతినేని చాలా చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాత స్రవంతి రవికిశోర్ తమ్ముని కొడుకుగా చిన్న వయస్సులోనే సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటి సినిమాతోనే తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు. వైవిఎస్ చౌదరి తీసిన దేవదాసు సినిమాతో 17ఏళ్లకే టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ సరసన ఇలియానా నటించింది.

ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ తనకు తగ్గట్టు లవ్ అండ్ ఎంటర్ టైనర్ మూవీస్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. తన 14ఏళ్ళ కెరీర్ లో రెడీ,మస్కా,కందిరీగ, పండగ చేస్కో,నేను శైలజ,హలొ గురు ప్రేమకోసమే వంటి సినిమాలతో హిట్స్ అందుకున్న రామ్ ఎప్పుడూ లవ్ అండ్ ఎంటర్ టైనర్స్ తోనే నెట్టుకొస్తున్నాడని ట్రోల్స్ పడ్డాయి. ఈ నేపథ్యంలో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమాకోసం కొత్త లుక్ తో కనిపించాడు.

అయితే కొన్ని సినిమాలను కెరీర్ లో రిజెక్ట్ కూడా చేసాడు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో నాని,సమంత జంటగా నటించిన ఏటో వెళ్ళిపోయింది మనసు మూవీ మొదట రామ్ దగ్గరికే వచ్చింది. కానీ వదులుకున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన రభస మూవీ కూడా రామ్ వదులుకోవాల్సి వచ్చింది. కానీ ఈ రెండు పెద్దగా ఆడలేదు కూడా. కానీ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రవితేజ నటించిన రాజా ది గ్రేట్ మూవీ కూడా రామ్ వదులుకోవడమే కొంత చర్చకు దారితీసింది. అయితే ఈ మూవీ రామ్ చేసి ఉంటె ఎలా ఉండేదో చెప్పలేం. అందుకే రామ్ సెలక్షన్ సూపర్ అనే టాక్ నడుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."