Prabhas కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏమిటో తెలుసా ?
Prabhas Movies : కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యాడు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసత్వంగా ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి,తన టాలెంట్ తో అనుకున్న లక్ష్యాన్ని చేధిస్తున్నాడు. కృషి ,పట్టుదల తో తక్కువ టైం లోనే అంచెలంచెలుగా ఎదిగి, మంచి పొజిషన్ కి చేరుకున్న ప్రభాస్ కి కోట్లాదిమంది ఫాన్స్ ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాహుబలి మూవీతో అంతర్జాతీయంగా తన సత్తా చాటాడు.
రాఘవేంద్ర,అడవి రాముడు,చక్రం,ఛత్రపతి,యోగి,పౌర్ణమి,మున్నా,బుజ్జిగాడు,ఏక్ నిరంజన్,డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్ , రెబెల్,మిర్చి వంటి విభిన్న సినిమాలతో ఆడియన్స్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. అయితే వర్షం సినిమాతో అమ్మాయిల్లో బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు.
హీరో,హీరోయిన్ మధ్య ఓ పాటలోనే ప్రేమ పుట్టడం,విలన్ ఇంటర్ డక్షన్,ఇవన్నీ వర్షం డైరెక్టర్ స్పెషాల్టీ. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించాడు. చిత్ర ,రబి కలాం, కల్పనా ఆలపించారు. ఈ సినిమా విజయంతో ప్రభాస్ ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఇక బాహుబలితో ఇతడి రేంజ్ ఎక్కడికో వెళ్ళింది.

