MoviesTollywood news in telugu

Chiranjeevi, ప్రభుదేవా కాంబోలో సాంగ్స్ ఎన్ని హిట్…?

Megastar Chiranjeevi and Prabhudeva : చిరంజీవి డాన్స్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్న కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, అలాగే సినిమాల్లో తన డాన్స్ లతో ఉర్రూతలూగించే మెగాస్టార్ చిరంజీవి కల్సి చేసిన సాంగ్స్ చాలా హిట్ కొట్టాయి. ఎన్నో సాంగ్స్ దుమ్మురేపాయి. ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో సాంగ్స్ ని పరిశీలిస్తే, 1990లో రిలీజైన కొదమసింహం మూవీకి ప్రభుదేవా తొలిసారిగా చిరంజీవికి కొరియోగ్రాఫర్ గా చేసాడు.

స్టార్ స్టార్ మెగాస్టార్ సాంగ్ కి సమకూర్చిన డాన్స్ అప్పట్లో కొత్తగా అన్పించింది. యూత్ ని కట్టిపడేసింది. ఈ సాంగ్ లో అలా నడుస్తూ చిరు ఓ స్టెప్ వేయడం ఎలా సాధ్యమో ఇప్పటికీ అర్ధం కాదు. ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన రాజావిక్రమార్క మూవీలో గగన కిరణం సాంగ్ కి మంచి పేరు వచ్చింది. 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీలో సాంగ్స్ చూస్తే,ప్రభుదేవా అంటే ఏమిటో చూపించాయి. అందరికీ తెలిసేలా చేసాయి.

చికు చికు సేలం టైటిల్ సాంగ్ పిచ్చెక్కిస్తుంది. ఈ సాంగ్ లోని స్టెప్స్ అప్పట్లో క్రేజ్ తెచ్చాయి. అలాగే వానా వాన వెల్లువాయ్ సాంగ్ కూడా స్టెప్స్ పరంగా అదరగొట్టేసింది. 1991లో విడుదలైన రౌడీ అల్లుడు సాంగ్స్ అన్నీ ప్రభుదేవా డిజైన్ చేసినవే. అమలాపురం బుల్లోడా సాంగ్ లో స్టెప్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో చెప్పలేం. లవ్ లీ మై హీరో సాంగ్ కూడా అదరగొట్టేస్తుంది .

ఇక 1992లో ఘరానా మొగుడు మూవీలోని బంగారు కోడిపెట్ట సాంగ్ కి వేసిన స్టెప్స్ ఓ ప్రభంజనమే సృష్టించింది. ఇండియా వైడ్ ఈ సాంగ్ గురించి చర్చ నడిచింది. కేరళలో ఈ సాంగ్ కారణంగా ఈ మూవీ 100 రోజులు ఆడేసింది. స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ మూవీకి డాన్స్ ప్రభుదేవా అయినా పెద్దగా గుర్తింపు రాలేదు. 1993లో వచ్చిన ముఠామేస్త్రి మూవీ ఈ పేటకు నేనే మేస్త్రీ సాంగ్ ఫాన్స్ కి పూనకాలు రప్పించింది.

మళ్ళీ ఈ సాంగ్ ప్లే చేయమని ఫాన్స్ థియేటర్లలో కుర్చీలు విరగొట్టిన సందర్భాలు న్నాయి. ఆతర్వాత మెకానిక్ అల్లుడు మూవీలో ప్రేమిస్తే ప్రాణమిస్తా, గుంతలిక్కడి గుండమ్మోయ్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆతర్వాత ప్రభుదేవా హీరోగా మారడంతో ఈ కాంబినేషన్ కి బ్రేక్ పడింది. మళ్ళీ వీరి కాంబోలో మూవీ రాలేదు. ఇప్పుడు డాన్స్ మాస్టర్స్, డాన్స్ చేసే హీరోలు ఉన్నా, చిరంజీవి, ప్రభుదేవా లెవెల్లో ఎవరికీ పేరు రాలేదు.