Nagarjuna ,అమల పెళ్లి జరగటానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా?
Nagarjuna and amala: నువ్వు సినిమాలకు పనికి రావన్నా సరే పట్టుదలతో శ్రమించి తానేమిటో నిరూపించుకున్న నటుడు కింగ్ నాగార్జున. విక్రమ్ మూవీతో వెండితెరపై హీరోగా మెరిసిన నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు. 60 ఏళ్ళు వచ్చినా సరే,నవ మన్మధుడుగా స్క్రీన్ పై వెలిగిపోతున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఆక్కినేని నాగేశ్వర రావు లు రెండు కళ్ళు గా భావిస్తారు.
ఇందులో అక్కినేని సినీ ఇండస్త్రీలో దాదాపు 75 ఏళ్ళు నటించాడు . మూడు తరాల నటులతో ఆయన కల్సి నటించారు. తెలుగు చిత్ర సీమలో స్టెప్పులకు శ్రీకారం చుట్టిన హీరో ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు అని ఠక్కున ఎవరైనా సమాధానం చెబుతారు. ఇక అక్కినేని కుమారునిగా నట వారసత్వం పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు కూతుర్ని 1984లో పెళ్లాడిన నాగార్జున కొంతకాలం ఆమెతో బానే సాగింది. 1986లో నాగ చైతన్య పుట్టాడు. అదే ఏడాది విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున 1989లో కిరాయిదాదా మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన అమలతో నాగ్ ప్రేమలో పడ్డాడు. అయితే అప్పటికే రామానాయుడు కూతురు లక్ష్మితో విడాకులు అయ్యాయి.
కిరాయిదాదా సినిమాను వి దొరస్వామి రాజు నిర్మించగా ఏ కోదండ రామిరెడ్డి డైరెక్ట్ చేసారు. ఈ మూవీతో అమల పరిచయం అయింది. 1990లో శివ సినిమాతో నాగ్ ,అమల బంధం బలపడింది. దీంతో నాగార్జున,అమల పెళ్లి కిరాయిదాదా మూవీ నిర్మాత దొరస్వామిరాజు దగ్గరుండి తిరుపతిలో పెళ్లి చేసినట్లు చెబుతారు.
వీళ్ళద్దరు ఏంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇక వీరిద్దరికీ పుట్టిన అఖిల్ బాలనటుడిగా పరిచయం అయ్యాడు. పెద్దయ్యాక హీరోగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక ముందు కొడుకు నాగ చైతన్య కూడా హీరోగా రాణిస్తూ, నటి సమంతను పెళ్లాడిన సంగతి తెల్సిందే.