శనగపిండితో ఇలా చేస్తే చాలు.. 7 రోజుల్లో మీ ముఖం బంగారంలా మెరిసిపోవడం ఖాయం!
Besan and turmeric Face Glow Tips In Telugu : సబ్ ఇమ్యూనిటీ క్రీమ్స్, ఫేస్ వాష్‌లు వాడి విసిగిపోయారా? మీ వంటగదిలో ఉండే సాధారణ శనగపిండి చర్మాన్ని ఎంత అద్భుతంగా మారుస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు.. ఎంతటి నల్లటి చర్మమైనా సరే కేవలం 7 రోజుల్లో బంగారంలా మెరిసిపోతుంది. ఆ సీక్రెట్ రెమెడీ ఏంటో ఇప్పుడే చదవండి!
ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి అందం పట్ల శ్రద్ద బాగా పెరిగింది. అందమైన ముఖం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందమైన ముఖం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకడుగు వేయరు. .అందమైన ముఖం కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

ముఖం మీద మొటిమలు నల్లని మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరవాలంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. అవన్నీ మన వంటగదిలో చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. కాస్త శ్రద్ద పెడితే సరిపోతుంది.
ఈ చిట్కా కోసం పసుపు, రోజ్ వాటర్, శనగ పిండి ఉపయోగిస్తున్నాము. పసుపును పురాతన కాలం నుండి సౌందర్య సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగ పిండి, పావు స్పూన్ పసుపులో రెండు లేదా మూడు స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంటయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మొటిమలు నల్లని మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరుస్తుంది. రోజ్ వాటర్ లో ఉన్న లక్షణాలు ముఖం పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. పసుపులో ఉన్న లక్షణాలు ముఖం మిద జిడ్డును తొలగిస్తాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

