బియ్యం కడిగిన నీళ్లతో 7 రోజుల్లో జుట్టు రాలడం మాయం.. పలచటి జుట్టును ఒత్తుగా మార్చే మ్యాజిక్ వాటర్!
Rice Water and flax seeds Hair fall Tips In telugu : ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలడం, పలచబడటం అనేది ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య. ఖరీదైన షాంపూలు, నూనెలు వాడి విసిగిపోయిన వారికి మన ఇంట్లోనే లభించే ‘బియ్యం కడిగిన నీళ్లు’ (Rice Water) ఒక అద్భుతమైన వరమని చెప్పవచ్చు.
వృథాగా పారబోసే ఈ నీళ్లలో కేశాల ఎదుగుదలకు అవసరమైన అమైనో ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కేవలం 7 రోజుల్లో జుట్టు రాలడాన్ని అరికట్టి, పలచగా ఉన్న జుట్టును కుదుళ్ల నుండి బలంగా, ఒత్తుగా మరియు పొడవుగా పెరిగేలా చేసే రైస్ వాటర్‌ను ఎలా తయారు చేసుకోవాలి? తలస్నానానికి ముందు దీనిని కేశాలకు ఎలా అప్లై చేయాలి? అన్న పూర్తి వివరాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.
మారిన జీవనశైలి పరిస్థితులు, ఒత్తిడి, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం, కెమికల్స్ ఎక్కువగా ఉండే నూనెలు, షాంపూలు ఎక్కువగా వాడటం వలన జుట్టు రాలే సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు.

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు రాలే సమస్య వస్తోంది. కొంతమందికి అయితే బట్టతల వచ్చేస్తోంది. ఇప్పుడు జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరగడానికి ఒక చిట్కా తెలుసుకుందాం. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి, జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది.
ఒక గిన్నెలో 2 స్పూన్ల బియ్యం, 2 స్పూన్ల ఆవిసే గింజలను, గ్లాసున్నర నీటిని పోసి పొయ్యి మీద పెట్టి 7 నుంచి 9 నిమిషాలు మరిగించాలి. అప్పుడే బియ్యం, ఆవిసే గింజలలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి జుట్టుకి పట్టించాలి. గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బియ్యం, ఆవిసే గింజలలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా అడ్డుకుంటాయి. దాంతో జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ రెమిడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

