MoviesTollywood news in telugu

Sumanth మొదటి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Sumanth first remuneration : సుమంత్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సరైన హిట్ పడలేదనే చెప్పాలి. అన్నీ ఉన్నా కాలం కల్సి రాకపోతే ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. అది ఏ రంగంలోనైనా ,ఎవరికైనా సరే, తప్పదు. టాలెంట్ ఉన్నా అదృష్టం ఉండాలి అంటారు అందుకే.

సరిగ్గా అక్కినేని మనవడు సుమంత్ విషయంలో దురదృష్టం ఎక్కువ వెంటాడింది. ఎన్ని సినిమాలు చేసినా హిట్ పడడం లేదు. ఇక కొన్ని వదిలేసుకున్న సినిమా లు హిట్ అయ్యాయి. సుమంత్ తన తొలి పారితోషికం గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు.

అక్కినేని నాగార్జునకు శివ లాంటి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అందించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ‘ప్రేమకథ’ పేరిట సుమంత్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి కూడా సక్సెస్ కాలేకపోయాడు.

వాస్తవానికి మళ్లీరావా సినిమా మంచి హిట్ అయింది. కానీ తరువాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేదు. సుమంత్ మేనమామ అక్కినేని నాగార్జునే స్వయంగా ప్రేమకథ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.

అయితే సుమంత్ ప్రేమకథ సినిమా తొలి సినిమా కాబట్టి ఈ సినిమాకు తాను ఎలాంటి పారితోషికం తీసుకోలేదని వెల్లడించారు. పోనీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తేరెమ్యునరేషన్ తీసుకుందామని అనుకుంటే, సినిమా ఫ్లాప్ అయిందని సుమంత్ చెప్పాడు. ఆ తరువాత యువకుడు సినిమాలో నటించగా 5 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్నాడు.