Gang Leader సినిమా కథ చిరు కన్నా ముందు ఎవరి దగ్గరకు వెళ్లిందో…?
Gang leader Telugu movie chiranjeevi :వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎక్స్ లెంట్ మూవీగా 1991లో విడుదలైన గ్యాంగ్ లీడర్ మూవీ నిల్చింది. అయితే నిజానికి ఈ సినిమా చిరంజీవి కోసం సిద్ధం చేయలేదట. హీరోగా కూడా చిరంజీవిని అనుకోలేదట. మరి చిరంజీవి మాస్ ఇమేజ్ ని అమాంతం పెంచేసిన ఈ సినిమా మెగాస్టార్ చేతిలోకి ఎలా వెళ్లిందో తెలుసా. ఒకసారి వివరాల్లోకి వెళ్తే కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి.
చిరంజీవి హీరోగా వచ్చిన కొండవీటి దొంగ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమాలో నాగబాబు కూడా ఓ పాత్రలో నటించాడు. నాగబాబు అందులో చేసిన నటనను పరుచూరి బ్రదర్స్ మెచ్చుకుని హీరోగా ఎస్టాబ్లిష్ అవుతావని సూచించారు. దాంతో తనను హీరోగా నిలబెట్టేలా ఓ స్టోరీ ని సిద్ధం చేయమని డైరెక్టర్ విజయ బాపినీడు ని కోరాడట. దీంతో విజయ బాపినీడు ఓ స్టోరీ రెడీ చేసాడు షోలే సినిమా లో ఫేమస్ డైలాగ్ అయిన అరె ఓ సాంబ అనే టైటిల్ అనుకున్నారట.
అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించడంతో తన అన్నయ్యకు ఈ సినిమా ఇవ్వాలని నాగబాబు చెప్పడంతో చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి,గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పెట్టారట. ఆ విధంగా చిరు చేతికి వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది.