Tollywood:ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా…?
Tollywood Star Hero nagarjuna : నాగార్జున ఇప్పటికి ప్రయోగాత్మక సినిమాలను చేస్తూ ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాగార్జున అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ ని అలరించే సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
60ఏళ్ళ వయస్సు దాటినా కూడా యంగ్ హీరోలకు తీసిపోని రీతిలో దూసుకెళ్తున్నాడు. అయితే తాజాగా నాగార్జున చిన్నప్పటి ఫోటో ఒకటి నెట్టింట వైరల్ కావడంతో నాగ్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు.
సోషల్ మీడియా విస్తృతం కావడంతో ఈమధ్య సెలబ్రిటీల విషయాలు, ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడంతో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో తమ అభిమాన హీరో చిన్నప్పటి ఫోటోలో చాలా క్యూట్ గా ఉన్నాడంటూ ఫాన్స్ వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉన్నాడు.