Hair Care Secrets: ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. జుట్టు రాలడాన్ని నివారించి సిల్కీగా మార్చే పెసల చిట్కా!
Moong dal Hair growth Tips: మారుతున్న జీవనశైలి, కాలుష్యం, పోషకాహార లోపం వల్ల ఈ రోజుల్లో చాలామందిని వేధించే ప్రధాన సమస్య హెయిర్ ఫాల్. మార్కెట్లో లభించే ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ వాడే బదులు, మన వంటింట్లో సహజంగా లభించే పెసలతో జుట్టు రాలడాన్ని అద్భుతంగా అరికట్టవచ్చు.
పెసలలో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్ మరియు జింక్ కుదుళ్లను బలోపేతం చేసి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడతాయి. జుట్టు ఒత్తుగా, సిల్కీగా మారడానికి పెసలను ఏ విధంగా హెయిర్ ప్యాక్‌గా ఉపయోగించాలో పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
వాతావరణంలో కాలుష్యం, జుట్టుకు సరైన పోషణ లేకపోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య అధికంగా కనబడుతుంది.

జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా ఉండే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
ఒక బౌల్ లో ఐదు స్పూన్ల పెసలు, ఒక స్పూన్ మెంతులు, రెండు గ్లాసుల నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం మిక్సీ జార్ లో నానబెట్టిన పెసలు, మెంతులు, రెండు స్పూన్ల కొబ్బరి తురుము వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి.
ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక స్పూన్ బాదం నూనె, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. అలాగే హెయిర్ డ్యామేజ్, డ్రై హెయిర్ వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Moong Dal For Hair Growth, Green Gram Hair Pack in Telugu, Hair Fall Control Remedies, Natural Hair Care Tips Telugu, Stop Hair Loss Naturally.

