Sugar Face Scrub: ముఖంపై నల్ల మచ్చలు, ట్యాన్ తొలగించే పంచదార చిట్కా.. ఇలా చేస్తే చర్మం గ్లో అవ్వడం ఖాయం!
Besan Face Glow Tips In telugu :కాలుష్యం, ఎండ ప్రభావం మరియు మృతకణాల (డెడ్ స్కిన్ సెల్స్) వల్ల ముఖం తరచుగా నిర్జీవంగా, డల్‌గా మారుతుంటుంది. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా పార్లర్ ఫేషియల్స్ అవసరం లేకుండా, మన ఇంట్లో ఉండే పంచదారతోనే అద్భుతమైన ఎక్స్ఫోలియేషన్ చేసుకోవచ్చు.
పంచదారలో ఉండే సహజసిద్ధమైన గ్లైకోలిక్ యాసిడ్ చర్మంపై పేరుకుపోయిన మురికిని, టాన్‌ను తొలగించి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది. ముఖానికి తక్షణ మెరుపునిచ్చే సులభమైన పంచదార ఫేస్ ప్యాక్స్ మరియు స్క్రబ్స్ తయారీ విధానం ఇక్కడ వివరంగా ఉంది.
మనలో ప్రతి ఒక్కరూ అందమైన, కాంతివంతమైన ముఖం కావాలని కోరుకుంటారు. అలా కోరుకోవటం కూడా సహజమే. దీని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మన ఇంటిలో ఉంటే సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని చాలా తక్కువ ఖర్చుతో మిలమిలా మెరిసేలా చేయవచ్చు.

కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ రాగి పిండి వేసి దానిలో కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి వృత్తాకార మోషన్ లో మసాజ్ చేయాలి. బాగా ఆరాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే ముఖం మీద పెరుకుపోయిన దుమ్ము, ధూళి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్,నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి. కాస్త సమయాన్ని కాస్త శ్రద్ద పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
శనగపిండిలో(besan flour) ఉండే జింక్ ముఖంపై వచ్చే మొటిమలు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అలాగే అదనపు జిడ్డు (సెబమ్) ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చర్మం మీద నలుపును తగ్గిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా మెరవటానికి సహాయపడుతుంది. చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.
రాగి పిండి వృద్ధాప్య ఛాయలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. పంచదారలో ఉన్న లక్షణాలు చర్మం మీద మృతకణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే కొబ్బరి నూనె చర్మం మీద తేమ ఉండేలా చేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com
Sugar Face Scrub in Telugu, Natural Skin Glowing Tips, Remove Sun Tan Naturally, Home Remedies for Glowing Skin, Sugar Face Pack for Bright Skin.

