MoviesTollywood news in telugu

Salman Khan హిట్ మూవీస్…ఈ తెలుగు సినిమాలే…ఏమిటో తెలుసా?

salman khan Hit movies :సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అయితే సల్మాన్ నటించిన హిట్ మూవీస్ లో తెలుగులో నుంచి రీమేక్ అయినవి ఉన్నాయి. అందులో నటించిన హీరోలెవరో, ఆ సినిమాలేంటి అనే విషయానికి వెళ్తే, 1989లో విక్టరీ వెంకటేష్,రేవతి నటించిన ప్రేమ మూవీ టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది.

ఇదే మూవీని సల్మాన్ హీరోగా లవ్ పేరుతొ 1991లో రీమేక్ చేసారు. అక్కడా మంచి విజయాన్ని అందుకుంది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో 1994లో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన హలో బ్రదర్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇదే మూవీని 1997లో జుద్వా పేరిట సల్మాన్ తో రీమేక్ చేస్తే, బ్లాక్ బస్టర్ అయింది. కరిష్మాకపూర్, రంభ హీరోయిన్స్ గా చేసారు.

తెలుగులో నీతోడు కావాలి మూవీతో ఛార్మి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకి రీమేక్ గా సల్మాన్ హీరోగా భూమిక, ప్రీతిజింటా హీరోయిన్స్ గా నటించిన అప్నా కహా మూవీ హిట్ అయింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పోకిరి మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇలియానా హీరోయిన్. ఇదే మూవీని ప్రభుదేవా డైరెక్షన్ లో సల్మాన్ హీరోగా హిందీలో వాంటెడ్ పేరుతొ రీమేక్ చేయగా అక్కడా అఖండ విజయాన్ని అందుకుంది.

రామ్ పోతినేని,జెనీలియా జంటగా నటించిన రెడీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇదే పేరుతొ హిందీలో సల్మాన్,ఆసిన్ జంటగా తీసిన రీమేక్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగుదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్టాలిన్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇదే సినిమాను సల్మాన్ హీరోగా జైహో పేరుతో రీమేక్ చేసారు.

మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీకి సోహెల్ ఖాన్ డైరెక్షన్ చేయగా, టబు,డైసీ హీరోయిన్స్ గా నటించారు.రవితేజ,ఇలియానా జంటగా నటించిన కిక్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇదే మూవీని సాజిద్ నాడియా డైరెక్షన్ లో సల్మాన్ హీరోగా రీమేక్ అయి, విజయాన్ని అందుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."