MoviesTollywood news in telugu

Aahuthi Movie గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Rajasekhar Aahuthi Movie : డాక్టర్ అయిన రాజశేఖర్ సినీ పరిశ్రమకు వచ్చి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యాడు. వందేమాతరం మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ రాజశేఖర్ హీరోగా చాలా సినిమాలు హిట్ అయ్యాయి.

ఇక మొదట్లో కోడి రామకృష్ణ, రాజశేఖర్ కాంబినేషన్ లో తలంబ్రాలు,ఆహుతి,అంకుశం మూవీస్ హ్యాట్రిక్ కొట్టాయి. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా రాజశేఖర్ కి పేరు వచ్చింది. అయితే ఆహుతి సినిమా సమయంలో డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్యం బాగోక పోయినా సినిమా మంచిదన్న ఉద్దేశ్యంతో అనారోగ్యంతో సైతం లెక్కచేయకుండా సినిమా చేసాడట.

ఆహుతి సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రసాద్ ఆ తర్వాత ఆహుతి ప్రసాద్ గా పేరు పొందాడు. ఇప్పటికీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆహుతి ప్రసాద్ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నాడు. అశోక్ పాత్రలో డాక్టర్ రాజశేఖర్ నటన అద్భుతం. విలనిజంతో కూడిన హీరో పాత్రలో రాజశేఖర్ ఒదిగిపోయాడు. 1987డిసెంబర్ 3న రిలీజైన ఈ సినిమాను ఎం ఎస్ రెడ్డి నిర్మించారు.

అయితే ఈ సినిమాలో ఇంకా బాగా చేయాల్సి ఉందని డాక్టర్ రాజశేఖర్ తన మిత్రుల దగ్గర చెప్పేవాడట. బాగానే చేసావని మిత్రులు చెప్పినా, ఆనారోగ్యం లేకుండా ఉంటె ఇంకా బాగా నటించేవాడినని రాజశేఖర్ అనేవారట. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. డూప్ లేకుండా ఫైట్స్ లో సైతం రాజశేఖర్ నటించి, మన్ననలు పొందాడు