1 సారి తాగితే రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా కండరాల నొప్పులు ఉండవు

Banana kiwi smoothie Benefits In telugu : పండ్లలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవికాలంలో కాస్త పని చేస్తేనే అలసట నీరసం వచ్చేస్తాయి. అందువల్ల శక్తిని అందించే పానీయాలను తీసుకుంటూ ఉంటే అలసట ఉండదు. అలాగే శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఒక మంచి smoothie తయారీ తెలుసుకుందాం. ఈ smoothie లో అరటిపండు,కివి ఉపయోగిస్తున్నాం.
Kiwi fruit
మిక్సీ జార్ లో ఒక అరటిపండును కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక కివి పండును తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఒక కప్పు పాలకూరను శుభ్రంగా కడిగి కట్ చేసి వేయాలి. అరచెక్క ఆవకాడోను ముక్కలుగా కట్ చేసి వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఆ తర్వాత ఒక కప్పు పాలను పోసి మరోసారి మిక్సీ చేయాలి.
Eating bananas during monsoon is good or bad
ఈ డ్రింక్ ని గ్లాస్ లో పోసి రెండు స్పూన్ల తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్ లో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండి రక్తప్రసరణ బాగా సాగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కండరాల నొప్పులు,కండరాల సమస్యలు లేకుండా చేస్తుంది. అలాగే అరటిపండు,కివి రెండింటిలోను ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణక్రియ సమస్యలు కూడా ఉండవు.
Cholesterol Reduced Fruits
ఈ డ్రింక్ ని కనీసం వారంలో రెండు సార్లు తాగితే మంచిది. ఈ డ్రింక్ లో విటమిన్‌ బి, సి, పీచుపదార్థంతోపాటు పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అందువల్ల నీరసం,అలసట కూడా ఉండవు. కివి,అరటిపండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.