Kitchenvantalu

Kitchen Tips:ఈ సింపుల్ చిట్కాలతో మీ కిచెన్ లో పనులన్నీ ఈజీగా చిటికెలో చేసేసుకోవచ్చు

Kitchen Tips: వంటింటిలో కొన్ని చిట్కాలను ఫాలో అయితే సమయం అదా అవ్వటమే కాకుండా డబ్బు కూడా అదా అవుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది.

పనస పండు తొనలు తీసే ముందు చేతులకు నూనె రాసుకుంటే జిగురు అంటుకోదు. లేదంటే చేతులకు అంటిన జిగురు ఒక పట్టాణా వదలదు.

రాగి గిన్నెల జిడ్డు వదలాలంటే నిమ్మ తొక్కలకు రాళ్ల ఉప్పు చేర్చి రుద్దితే సరి. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

మరమరాలు కరకరలాడాలంటే గంట సేపు ఎండలో ఆరబెట్టి తీయాలి.

కూలర్లో కొంచెం రోజ్ వాటర్ కలిపితే గదంతా సువాసన వస్తుంది. కూలర్ నుంచి ఎటువంటి దుర్వాసన రాదు.

దొండ, చామదుంప, ఆలూ వంటి కూరలు రుచిగా వుండాలంటే వేగించిన జీలకర్ర పొడిని కలపాలి.

వేసవిలో కూరగాయలు త్వరగా వడలి పోకుండా వుండాలంటే తడి వస్త్రంలో చుట్టి అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి.

గ్యాస్ స్టవ్ కొత్తదానిలా మెరవాలంటే నిమ్మకాయల డిప్పలను ఉడికించి …..ఆ నీటిలో స్పాంజిని ముంచి తుడవాలి

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."