MoviesTollywood news in telugu

కమెడియన్ సత్య సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా?

Tollywood comedian satya:పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లో నటించి మంచి పేరు తెచ్చుకుని సినిమాల్లోనూ సత్తా చాటిన కమెడియన్ సత్య. నిజానికి జబర్దస్త్ కామెడీ షో మొదలైనపుడు ధన్‌రాజ్ టీంలో లావుగా ఉండే కమెడియన్ గా సత్య అందరికీ దగ్గరయ్యాడు. కొన్ని స్కిట్స్ చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీ తెచ్చుకున్నాడు. కానీ ఉన్నట్లుండి ఆ షో నుంచి బయటికి వచ్చేసాడు.

స్వామి రారా సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. దాంతో తెలుగు ఇండస్ట్రీకి మంచి కమెడియన్ దొరికాడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.. వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. సత్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నా కూడా కెరీర్ మొదట్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాస్తవానికి దర్శకుడవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి నటుడుగా, అందునా కమెడియన్ అయిపోయాడు.

కెరీర్ మొదట్లో నితిన్ ద్రోణ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు. ఆ చిత్ర దర్శకుడు కరుణ కుమార్ తనను కమెడియన్‌గా మార్చేసాడని.. దానికి నితిన్ కూడా ఒప్పుకోవడంతో అలా తన ప్రయాణం మొదలైందని సత్య ఓ ఇంటర్యూలో చెప్పాడు. నటుడిగా మారిన తర్వాత కూడా ఆరేళ్ళ వరకు ఎలాంటి గుర్తింపు రాలేదని, ఆ సమయంలో వచ్చిన జబర్దస్త్ తనను నటుడిగా నిలబెట్టిందని చెప్పాడు.

అందుకే జబర్దస్త్ షో కి ఎప్పుడూ రుణపడే ఉంటానని సత్య అంటున్నాడు. అలాంటి సమయంలో స్వామి రారాలో ఆఫర్ వచ్చిందని, అది విడుదలైన తర్వాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాడు . ఇక ఛలో సినిమా తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని.. ఆ సినిమాతో తన జీవితం మరో మలుపు తిరిగిందని చెప్పాడు. జబర్దస్త్ షో వదిలేయడానికి కారణం కూడా సినిమాలే అని చెప్పాడు సత్య.

స్వామి రారా తర్వాత వరసగా అవకాశాలు రావడంతో జబర్దస్త్ నుంచి తప్పుకోక తప్పలేదని చెప్పాడు . మత్తు వదలరాలో తన క్యారెక్టర్ చూసి రాజమౌళి మెచ్చుకున్నాడని, అది తను ఎప్పటికీ మరిచిపోలేనని సత్య ఆనందంగా చెప్పాడు. ఇక రీసెంట్ గా వచ్చిన “రంగబలి” సినిమాలో సత్య కామెడీని చాలా అద్భుతంగా పండించాడు. “రంగబలి” సినిమా ప్రమోషన్లలో భాగంగా… అతను చేసే ఇంటర్వ్యూలలో యాంకర్స్ ని ఇమిటేట్ చేస్తూ అతను చేసిన ఇంటర్వ్యూలు చాలా వైరల్ గా మారాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."