Movies

తనకు ఉన్న లోపాన్ని బయటపెట్టిన పవన్ కళ్యాణ్…అది ఏమిటో తెలుసా?

ఎంత పెద్ద స్టార్ అయితేనే అందరికి ఎదో ఒక లోపం ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ కి కూడా ఉంది. దాన్ని అయన దాచుకోకుండా బహిరంగంగా చెప్పేసారు. పవన్ కళ్యాణ్ తనలో ఉన్న లోపాన్ని ప్రకటించాడు. ఆ లోపం హీరో రవితేజలో లేదని ప్రశంసించాడు. ఇంతకీ పవన్ లో ఉన్న లోపం ఏమిటో తెలుసా? సిగ్గు…పవన్ కళ్యాణ్ కి సిగ్గు చాలా ఎక్కువట. సిగ్గు ఎక్కువగా ఉండుట వలన సినిమాల్లో అంత బాగా చేయలేకపోతున్నానని తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న నేల టిక్కెట్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.

చిరంజీవి తర్వాత ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన స్టార్ రవితేజ అని, రవితేజ సినిమాల్లో నటిస్తున్నప్పుడు,నేను అసలు హీరోగానే ఎంట్రీ ఇవ్వలేదని, మద్రాస్ లో ధియేటర్ లో రవితేజను చూశానని చెప్పుకొచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ మరొక ఆసక్తికరమైన విషయాన్నీ వెల్లడించారు. రవితేజకు ఏ మాత్రం సిగ్గు లేదని షూటింగ్ లో వంద మంది ఉన్నా ఏ మాత్రం భయపడకుండా సిగ్గు పడకుండా నటిస్తాడని, తనకు మాత్రం ఆలా సాధ్యం కాదని చెప్పుతూ…. రవితేజ సిగ్గును ఇంటిలో వదిలేసి వస్తాడని చెప్పాడు.

తాను మాత్రం పది మంది ఉన్నా నటించలేనని అన్నారు పవర్ స్టార్. ఎంతో బాధ,కష్టం అనుభవిస్తే కానీ అటువంటి కమిట్ మెంట్ ఉండదని పవన్ రవితేజను మెచ్చుకున్నారు. ఇలా తనలో సిగ్గు అనే లోపం ఉందని పవన్ బహిరంగంగానే ఒప్పుకున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."