Politics

ద్రవిడ్ కు చిర్రెత్తుకొచ్చి.., ధోనీ కు గాడ్ ఫాదర్ అయ్యాడు.. ఎలాగో చూద్దాం..

అపుడు గంగూలీ టీమిండియా కెప్టెన్.., నిలకడలేని వికెట్ కీపర్లతో టీమిండియా సతమతమవుతున్న రోజులు. ఏ వికెట్ కీపర్ కూడా బ్యాటింగ్ లో రాణించలేక, టీమిండియా కు బరువవుతున్న రోజులవి. ఆ సమయం లో కెప్టెన్ గంగూలీ తీవ్రంగా ఆలోచించి, జట్టులో వికెట్ కీపర్ బదులు ఒక స్పెషలిస్ట్ బ్యాట్సమెన్ చోటు ఇచ్చి, వికెట్ కీపింగ్ బాధ్యతలను, రంజీ ట్రోఫీ ఆడే రోజుల్లో, అపుడపుడు అంతో ఇంతో వికెట్ కీపింగ్ చేసిన అనుభవమున్న రాహుల్ ద్రావిడ్ కు వికెట్ కీపింగ్ బాధ్యతలను అప్పగించాడు. రాహుల్ ద్రావిడ్ అయిష్టంగానే ఆ బాధ్యతను స్వీకరించాడు. రాహుల్ ద్రావిడ్ వికెట్ కీపింగ్ బాగానే చేసినా, కీపింగ్ లో తడబాటు కనబడేది. ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి అయినప్పటికీ, తన వికెట్ కీపింగ్, ముందు ద్రావిడ్ కే నచ్చేది కాదు.

ఒక సిరీస్ తరువాత, మరో సిరీస్, ఇదే తంతు కొనసాగుతోండడంతో, ఇక దీనికి పరిష్కారం తానే కనుగొన నిశ్చయించాడు రాహుల్ ద్రావిడ్. ఇండియన్ క్రికెట్ టీమ్ కోసం మంచి వికెట్ కీపర్ ను శోధించదలచి, దేశవాళీ క్రికెట్ పై ఓ కన్నేశాడు ద్రావిడ్. ఆ సమయం లో మహేంద్ర సింగ్ ధోని పేరు వినిపించింది, ద్రావిడ్ కు.

స్వయంగా వెళ్లి ధోనీ ఆటను వీక్షించాడు, రాహుల్ ద్రావిడ్. ఆ రోజు కూడా అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు ధోని. వెంటనే ద్రావిడ్ ఇండియన్ క్రికెట్ బోర్డు కు ధోనీ ను రికమెండ్ చేయడం, ధోనీ ఇండియన్ టీమ్ లోకి అడుగు పెడడం వెంటవెంటనే జరిగిపోయాయి.

అలాగే మహేంద్రసింగ్ ధోని టీమ్ ఇండియా కెప్టెన్ కావడం లోనూ రాహుల్ ద్రావిడ్ పాత్ర ఉంది. ధోని వికెట్ కీపింగ్ చేసే సమయం లో ద్రావిడ్, సచిన్ లు స్లిప్స్ లో ఫీల్డర్లు గా ఉండేవారు. ఆ సమయంలో, కెప్టెన్ నిర్ణయాలు ఎలా ఉన్నా, తదుపరి ఆట ఎత్తుగడలు గూర్చి స్లిప్స్ లో వీరు చర్చించుకునే సందర్భం లో, బౌలర్, బ్యాట్సమెన్ బలాలు, బలహీనతలను బట్టి ఫీల్డింగ్ ను మోహరించే ఎత్తుగడలను విపులీకరించడం లో ధోనీ కున్న నైపుణ్యం, సచిన్ మరియు ద్రావిడ్ లను అబ్బురపరచేది.

గంగూలీ తరువాత, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే కూడా టీమ్ ఇండియా కెప్టెన్ బాధ్యతలను చేపట్టినప్పటికీ, వీరు కెప్టెన్ లు గా పూర్తి స్థాయిలో రాణించలేకపోయారు.

ఇక టీమిండియా తదుపరి కెప్టెన్ గా ఎవరిని నియమించాలి అని ఇండియన్ క్రికెట్ బోర్డు తర్జనభర్జన పడుతుంటే, సచిన్, ద్రావిడ్ లు మహేంద్ర సింగ్ ధోనీ పేరును రికమెండ్ చేయడం, ఆ వెంటనే ధోని కెప్టెన్ కావడం జరిగిపోయాయి.