Healthhealth tips in telugu

Star fruit health benefits:సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే దొరికే ఈ పండును అసలు మిస్ చేసుకోవద్దు

Star fruit health benefits:ప్రస్తుతం సీజన్ లో స్టార్ ఫ్రూట్ చాలా విరివిగా లభ్యం అవుతుంది. ఏ సీజన్ లో దొరికే పండ్లను ఆ సీజన్ లో తప్పనిసరిగా తినాలి. అప్పుడే సీజనల్ గా వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి. స్టార్ ఫ్రూట్ లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకి ఒక స్టార్ ఫ్రూట్ తింటే సరిపోతుంది.
Star Fruit Benefits
స్టార్ ఫ్రూట్ అనేది పసుపు, ఆకుపచ్చ మిళితమైన రంగులో ఉంటుంది. ఈ ఫ్రూట్ ని చాలా మంది తినటానికి ఆసక్తి చూపరు. వీటిలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తప్పనిసరిగా తింటారు. ఈ పండును అడ్డంగా ముక్కలుగా కోస్తే వాటి ఆకారం స్టార్స్‌లా ఉంటుంది. అందుకే వీటిని ‘స్టార్ ఫ్రూట్స్’ అంటారు. దీనిలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
star fruit
శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్‌తో పోరాడే శక్తి రోగనిరోధక వ్యవస్థకు వస్తుంది. స్టార్ ఫ్రూట్ లో డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన అధిక బరువు ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా స్టార్ ఫ్రూట్ ని తినవచ్చు. ఎందుకంటే స్టార్ ఫ్రూట్ లో కేలరీలు, చక్కెర, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.
blood thinning
స్టార్ ఫ్రూట్ లో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య తగ్గించటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో మెగ్నిషియం సమృద్దిగా ఉండుట వలన నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తింటే సరిపోతుంది. ఈ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది.

కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటం వలన తొందరగా ఆకలి వేయదు. స్టార్ ఫ్రూట్ తినడం వల్ల ఇందులో ఉన్న కాల్షియం రక్తనాళాలు మరియు ధమనులపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
Star Fruit Benefits
స్టార్ ఫ్రూట్‌లో హానికర సూక్ష్మజీవులను తట్టుకునే యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టిరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. స్టార్ ఫ్రూట్‌లో ఉన్న ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, సపోనిన్లు, స్టెరాయిడ్స్, ఫైటో కెమికల్స్ వల్లే దీనికి యాంటీ బ్యాక్టిరియిల్ లక్షణాలు వచ్చాయి. పండిన స్టార్ ఫ్రూట్ తో పోలిస్తే, ఆకుపచ్చగా ఉన్న పండులోనే అధికగా నిరోధక శక్తి ఉంటుంది. రోజుకి ఒక పండు తింటే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."