Healthhealth tips in telugu

Fast Eating Habit: గబగబా తినే అలవాటుందా..కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్టే…

Fast Eating Habit: మనలో చాలా మంది భోజనం లేదా టిఫిన్ మరే ఏ ఆహారం అయినా గబగబా తినేస్తూ ఉంటారు. అయితే ఇలా హడావిడిగా తినటం అనేది మన ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల భోజనం నిదానంగా తినటం అలవాటు చేసుకోవాలి. ఈ విషయం మీద నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

భోజనం హడావిడిగా కాకుండా 30 నుంచి 35 నిమిషాల పాటు బాగా నమిలి తినాలి. భోజనం చాలా వేగంగా తినటం వలన గొంతులో ఇరుక్కుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గబగబా తినటం వలన జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. బాగా నమిలి తింటే ఆ ఒత్తిడి తగ్గి జీర్ణవ్యవస్థ పని సులభతరం అవుతుంది.

ఆహారాన్ని సరిగా నమలకుండా హడావిడిగా తినటం వలన అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా పొట్ట, నడుము మీద ప్రభావం పడి తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి డయాబెటిస్ వచ్చే అవకాశంను పెంచుతుంది.

ఈ విధమైన ఆహారపు అలవాటు కారణంగా ముఖ్యంగా జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రబహ్వం పడుతుంది. ఇది ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఆహారం తీసుకొనేటప్పుడు నిదానంగా నమిలి తినటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఎటువంటి సమస్యలు ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News