Chia Seeds:ఈ సీడ్స్ రోజు తీసుకుంటే…ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు
chia seeds benefits in telugu : chia seeds ని ఒకప్పుడు చాలా తక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితి కారణంగా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టటానికి ప్రతి రోజు వాడుతున్నారు. మనలో చాలా మందికి ఆరోగ్యం పట్ల్స్ శ్రద్ద పెరిగి ఇటువంటి ఆహారల వైపుకు అడుగులు వేస్తున్నారు.
చియా విత్తనాలను సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు., ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు వీటిని చాలా తక్కువగా వాడే వారు. అలాగే చాలా తక్కువగా లభించేవి. కానీ ప్రస్తుతం విరివిగా లభించడమే కాకుండా వీటి వాడకం కూడా చాలా ఎక్కువైంది.
Chia seeds లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన తొందరగా ఆకలి వేయకుండా చేయటమే కాకుండా ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ప్రోటీన్ సమృద్దిగా ఉండుట వలన మాంసాహారం తినలేని వారికి ఈ విత్తనాల ద్వారా ప్రోటీన్ బాగా అందుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
కాల్షియం, ఫాస్పరస్, మెగ్నిషియం, ప్రోటీన్లు సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా,ఆరోగ్యంగా ఉండి ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేసి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పుల వంటి అన్నీ రకాల నొప్పులను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ chia seeds వేసి మూడు గంటలు నానబెడితే ఆ గింజలు ఉబ్బి జెల్లీ మాదిరిగా అవుతాయి. వీటిని నేరుగా తీసుకోవచ్చు. లేదా జ్యూస్‌లు, సలాడ్‌లు, మజ్జిగ వంటి పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. చియా విత్తనాలను నేరుగా తినడం కంటే వీటిని వేరే ఆహార పదార్థాల్లో కలిపి తినడం వలన అధిక ప్రయోజనం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tips To Reduce Uric Acid:పరగడుపున ఈ టీ తాగితే..యూరిక్ యాసిడ్ తొలగిపోతుంది
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

