Sleep: నిద్ర సరిగా పోవడం లేదా..? అయితే ఈ ప్రమాదకరమైన సమస్యలు రావటం ఖాయం
Sleep: మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ఆహారం ఎంత అవసరమో…నిద్ర కూడా అంతే అవసరం. సరైన నిద్ర లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే రోజుకి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం.
నిద్ర రావటానికి మందులను అసలు వాడకూడదు. పగటి సమయంలో శరీరక శ్రమ బాగా చేసి రాత్రి పూట తేలికైన ఆహారం తీసుకుంటే నిద్ర బాగా వస్తుంది. సాయంత్రం సమయంలో వ్యాయామం చేసిన సరే రాత్రి సమయంలో నిద్ర బాగా వస్తుంది.ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నిద్ర సారిగా లేకపోతే ఏ సమస్యలు వస్తాయో చూద్దాం.
గుండెజబ్బుల ప్రమాదం పెరిగి స్ట్రోక్ వచ్చే ప్రమాదం నాలుగు రెట్లు పెరుగుతుంది.
డయాబెటిస్ వచ్చే అవకాశాలు రెట్టింపు అవుతాయి
నిద్ర తక్కువ అయితే ఆ ప్రభావం మెదడు కణజాలంపై చూపుతుంది.
అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.
ఆకలి ఎక్కువ అవుతుంది. దాంతో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవటం వలన అధిక బరువు సమస్య వస్తుంది.
రూపం, చర్మం చెడిపోతుంది.
తలనొప్పి వచ్చే అవకాశంను పెంచుతుంది
పని ప్రదేశంలో ఏకాగ్రత ఉండదు.
ఇది కూడా చదవండి: Cockroaches Remedies: రూపాయి ఖర్చు లేకుండా బొద్దింకల బెడద తప్పాలంటే..ఇలా చేస్తే సరి
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

