Healthhealth tips in telugu

Water Drinking : భోజనానికి ముందు నీరు తాగితే మంచిదా.. తర్వాతనా..

Water Drinking : ఆరోగ్యంగా ఉండేందుకు నీరు చాలా అవసరం. ఇది అందరికీ తెలుసిందే. ఫుడ్ లేకుండా మన బాడీ కొన్ని వారాల పాటు ఉంటుంది. కానీ, నీరు లేకుండా మాత్రం కొన్ని రోజులే ఉంటుంది.

రక్తం, జీర్ణ రసాలు, మూత్రం, చెమట వంటివన్నీ నీటితోనే కదా.. సన్నని కండరాలు, కొవ్వు, ఎముకలలోనూ నీరు ఉంటుంది. మరి నీరు ఎప్పుడు తాగాలి.. ఎలా తాగాలి.. ఏ నీరు తాగాలి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి.

మంచి నీటిని ఎక్కువగా తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందుకే పోషకాహార నిపుణులు కూడా నీరు ఎక్కువగా తాగమని చెప్పుతూ ఉంటారు. నీరు తాగే విషయంలో మనలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

ఆహారం తీసుకునేముందు ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కువ నీరు తీసుకోవడం ద్వారా ఆహారం తీసుకునే మోతాదు తగ్గుతుంది. క్యారెట్లు, కీరదోస ముక్కలు వంటివి తినడం ద్వారా ఒబిసిటీ దూరం చేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు ఆఫీసులో ఉంచుకోవాలి. ఏమీ తినకుండా వచ్చిన రోజు వాటిని తింటే శక్తి లభిస్తుంది. లేదంటే ఆకలి వల్ల మెదడు పని తీరు సన్నగిల్లుతుంది.

పనిమీద ఏకాగ్రత ఉండదు. రోజంతా ఆ ప్రభావం ఉంటుంది.అల్పాహారం తీసుకోనప్పుడు రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే టైప్2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంది.

ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల బయటి ఆహారం మీదకు మనసు లాగుతుంది. అలా బయట తిండికి అలవాటు పడితే త్వరగా బరువు పెరిగే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ