Kitchenvantalu

గుమగుమలాడే గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ.. ఒకసారి ఇలా చేస్తే లొట్టలేసుకుని తింటారు!

Gutti Vankaya Gravy curry Recipe: వంకాయంత కూర లేదు..” అని మన పెద్దలు ఊరికే అనలేదు. అందులోనూ ‘గుత్తి వంకాయ’ అనగానే మన తెలుగువారికి అదో స్పెషల్ ఎమోషన్. వేడి వేడి అన్నంలోకి చిక్కటి గ్రేవీతో గుత్తి వంకాయ కలుపుకుని తింటే ఆ మజాయే వేరు!

అయితే, చాలాసార్లు ఇంట్లో చేస్తే గ్రేవీ నీళ్లలా రావడం లేదా మసాలా వంకాయకు సరిగ్గా పట్టకపోవడం లాంటివి జరుగుతుంటాయి. అందుకే, అచ్చం రెస్టారెంట్ లేదా దాబా స్టైల్‌లో థిక్ గ్రేవీతో, వంకాయ లోపలి వరకు మసాలా రుచి వెళ్లేలా ఈ కర్రీని పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓసారి ఇలా చేసి చూడండి, ఇంట్లో వాళ్లంతా ఫిదా అవ్వాల్సిందే!

వంకాయతో ఎన్ని వెరైటీస్ చేసినా, గుత్తి వంకాయ మసాలా కర్రీ, తింటే, ఆ మజాయే వేరు. కేవలం ఫంక్షన్స్ లోనే స్పెషల్ గా కాదు, ఇంట్లో కూడా ఈజీగా వంకాయ మలై కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
Vankaya Health Benefits in Telugu
కావాల్సిన పదార్ధాలు
వంకాయలు – 6
పెపర్ పౌడర్ – ½ టీ స్పూన్
బటర్ – 1 టేబుల్ స్పూన్
మిల్క్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయలు – ఒక కప్పు
ఉప్పు – తగినంత
కొత్తిమీర – కొద్దిగా
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
నూనె – 2 టేబుల్ స్పూన్స్
బిర్యాని – ఆకు
యాలకులు – 4
లవంగాలు – 4
దాల్చిన చెక్క – 2 ఇంచులు
జీలకర్ర – ½ టీ స్పూన్
కారం – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు – 15
మస్క్ మెలాన్ విత్తనాలు – 2 టీ స్పూన్స్
పచ్చిమిర్చి -5

తయారీ విధానం
1.వంకాయలను ముందుగా శుభ్రంగా కడిగి, నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.కట్ చేసుకున్న ముక్కలను నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం, పల్లీలు, జీడి పప్పులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నిటిని, ఒక మిక్సీ జార్ లో వేసుకుని, మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని, నెయ్యి ,నూనె వేసుకోవాలి.
5. వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, బిర్యాని ఆకు, వేసుకుని, అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి.

6. ఇఫ్పుడు అందులోకి ఉప్పు ,కారం, జలకర్ర పొడి యాడ్ చేసి నూనెలో కలిసేలా కలుపుకోవాలి
7. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
8. తర్వాత అందులోకి వంకాయలు వేసి బాగా కలుపుకోవాలి.
9. ఇప్పుడు గ్రేవీకి నీళ్లు పోసి , మూత పెట్టి, మీడియం ఫ్లేమ్ పై, ఆయిల్ పైకి తేలే వరకు, ఉడికించాలి.
10.చివరగా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు, అందులోకి, పెప్పర్ పౌడర్,బటర్, మరియు మిల్క్ క్రీమ్ వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయండి.
11. అంతే ఎంతో రుచికరమైన వంకాయ మలై కర్రీ రెడీ అయిపోయినట్లే..

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."