ఎంతటి మొండి పాదాల పగుళ్లు అయినా సరే.. ఈ చిట్కాతో 3 రోజుల్లో మాయం అవ్వాల్సిందే!
cracked heels Home Remedies : నడిచేటప్పుడు పాదాల పగుళ్ల వల్ల వచ్చే ఆ చురుక్కుమనే నొప్పి ఎంత నరకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కోసారి ఆ పగుళ్లలోంచి రక్తం కూడా వస్తుంటుంది. నలుగురిలో చెప్పులు విప్పాలంటే ఇబ్బంది, నడవాలంటే నొప్పి.. ఈ సమస్యతో మీరు కూడా బాధపడుతున్నారా? మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ రాసినా పెద్దగా ఫలితం కనిపించడం లేదా?
అయితే ఇక అస్సలు టెన్షన్ పడకండి. ఎలాంటి ఖర్చు లేకుండా, మన ఇంట్లో దొరికే వస్తువులతోనే కేవలం 3 రోజుల్లో ఈ మొండి పగుళ్లను ఎలా మాయం చేయాలో ఈ ఆర్టికల్ లో మీకోసం వివరంగా రాశాను. ఈ అద్భుతమైన చిట్కాతో మీ పాదాలు మళ్లీ పట్టులా మృదువుగా మారుతాయి!

పాదాల పగుళ్లు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటే చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా పగుళ్ళ మధ్య దుమ్ము,ధూళి పెరుకుపోయి సమస్య ఎక్కువ అవుతుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నాలు చేయాలి. మార్కెట్ లో దొరికే క్రీమ్స్ కన్నా ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.
పాదాల పగుళ్లు రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొబ్బరి నూనె, ఆముదం, మీగడ వంటి వాటితో సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ మూడింటిలో ఏది అందుబాటులో ఉంటే దానిని తీసుకొని పాదాల పగుళ్ళు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి.
ఆ తర్వాత పాదాలని సుమారు 20 నిముషాల పాటు గోరువెచ్చని నీరు ఉన్న బకెట్ లో ఉంచుకోవాలి. తర్వాత మెత్తటి బ్రష్ లేదా కాళ్ళు రుద్దుకునే రాయి తీసుకోని పాదాలని శుభ్రం చేయాలి. ఈ విధంగా పది రోజుల పాటు ప్రతి రోజు చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు క్రమంగా తగ్గుతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.
ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కొబ్బరి నూనె, ఆముదం, మీగడ ఈ మూడు పాదాల పగుళ్లను తగ్గించటానికి చాలా సమర్ధ వంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇంటి చిట్కాలు ఫాలో అయ్యి పాదాల పగుళ్ళ సమస్య నుంచి బయట పడండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

