వేడి వేడి అన్నంలోకి కమ్మటి సొరకాయ పచ్చడి.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
Bottlegourd Chutney Recipe: వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, కమ్మటి సొరకాయ పచ్చడి కలుపుకుని తింటే ఆ మజాయే వేరు కదూ! పల్లెటూరి వంటల రుచిని గుర్తుచేసే అద్భుతమైన ‘సొరకాయ పచ్చడి’ని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేయాలో ఈ రోజు చూద్దాం.
రైస్, దోశ లేదా ఇడ్లీ.. దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ చట్నీ. ఒక్కసారి ఈ స్టైల్‌లో చేసి చూడండి, ఇంట్లో అందరూ మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు! ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం కోసం కింద చదవండి.
వంటికి చలవ చేసే వారికి, డైట్ లో ఉన్నవారికి, ఎంతో ఉపయోగ పడే, సొరకాయ పచ్చడి అదిరిపోతుంది. పచ్చిమిరప ఘాటు , సొరకాయ తీపితో, కమ్మకమ్మగా ఉండే, సొరకాయ పచ్చడి ట్రై చేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
సొరకాయ ముక్కలు – 3 కప్పులు
టామాటో – 2
పచ్చిమిర్చి -15
కొత్తిమీర – చిన్న కట్ట
చింతపండు – ఉసిరి కాయంత
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు – తగినంత
పసుపు – కొద్దిగా
తాలింపు కోసం..
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1/2 టీ స్పూన్
జీలకర్ర – 1/2 టీ స్పూన్
మినపప్పు – 1/2 టీ స్పూన్
పచ్చిశనగపప్పు – 1/2 టీ స్పూన్
ఇంగువ – 2 చిటికెలు
కరివేపాకు – 1 రెబ్బ
ఎండుమిర్చి – 1
తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, అందులోకి సొరకాయ ముక్కలు,పచ్చిమిర్చి వేసి, మూత పెట్టుకుని, ముక్కలు మెత్తపడే వరకు మగ్గనివ్వాలి.
2. మగ్గిన సొరకాయ ముక్కల్లో టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, వేసి మరికాసేపు మగ్గించాలి.
3. మగ్గిన టమాటాలో కొత్తిమీర, చింతపండు, వేసుకుని, ఒక నిముషం కలిపి చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
4. ఇఫ్పుడు తాలింపు కోసం స్టవ్ పై పాన్ పెట్టి, నూనె వేడి, చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఒకోక్కటిగా వేస్తూ, మినపప్పు, శగనపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, చివరగా, ఇంగువ చల్లి, తాళింపును పచ్చడిలో కలుపుకోవాలి.
5. అంతే ఘుమఘుమలాడే సొరకాయ పచ్చడి రెడీ అయినట్లే,..

