Kitchen Tips : మహిళల కోసం ప్రత్యేక వంటింటి చిట్కాలు.. అసలు మిస్ కావద్దు
Kitchen Tips in telugu : ప్రతి రోజు వంటింటిలో ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటాం. వంటల చిట్కాల కోసం వంటల పుస్తకాలతోపాటు, సోషల్ మీడియాలో వంటల ప్రోగ్రామ్స్ ను ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటి గృహిణులకు ఉపయోగపడే చిట్కాలు కొన్ని మీకోసం…
మనం వంట చేసినప్పుడు ఎదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. కూరలో కారం ఎక్కువైతే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. కూరల్లో కారం కాస్త ఎక్కువైతే అందులో కొంచెం నిమ్మరసం లేదా రెండు టీస్పూన్ల నెయ్యి కలిపితే కారం తగ్గుతుంది.
రోజు కాఫీ తాగి బోరుకొడితే వెరైటీగా కాఫీ మంచి రుచిగా ఉండేందుకు అందులో కొద్దిగా బోర్నవిటా కలుపుకోవాలి. దీంతో కాఫీకి మంచి రుచి వస్తుంది.
బొంబాయి రవ్వ హల్వా మరింత రుచిగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ శెనగ పిండిని కలుపుకుకోవాలి.
మిగిలిపోయిన అన్నంలో కొంచెం మసాలా దినుసులు, బ్రెడ్ వేసి అన్నాన్ని మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంతో కరకరలాడే పకోడీలు తయారు చేసుకుని తినవచ్చు. మిగిలిన అన్నంను పాడేయవలసిన అవసరం లేదు.
గులాబ్ జామున్ లు గట్టిగా అయితే పంచదార పాకంతో సహా వాటిని ప్రెషర్ కుక్కర్ లో పెట్టి సన్నటి మంటమీద ఐదు నిమిషాలు ఉడికిస్తే మృధువుగా మారతాయి. మనలో చాలా మందికి గులాబ్ జామున్ చేసినప్పుడు గట్టిగా వస్తూ ఉంటాయి. అలాంటి వారికీ ఈ చిట్కా బాగా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News

