రక్తం పెరగాలన్నా, బరువు తగ్గాలన్నా.. ఈ క్యారెట్ జింజర్ సూప్ తాగాల్సిందే!
Carrot Ginger Soup:రోజంతా నీరసంగా అనిపిస్తోందా? బరువు తగ్గాలని డైటింగ్ చేస్తూ ఆకలితో అలమటిస్తున్నారా? అయితే ఈ ‘క్యారెట్ జింజర్ సూప్’ మీ కోసమే! ఇటు రుచికి రుచి, అటు ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే బెస్ట్ రెసిపీ ఇది.
ఇందులో వాడే క్యారెట్ వల్ల శరీరంలో రక్తం పెరిగి నీరసం మాయమైతే.. ఘాటైన అల్లం వల్ల మెటబాలిజం బూస్ట్ అయ్యి బరువు ఈజీగా తగ్గుతారు. వినడానికే ఎంతో హెల్తీగా అనిపిస్తోంది కదూ! ఈ టేస్టీ సూప్‌ని ఇంట్లోనే పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ బ్లాగ్‌లో వివరంగా రాశాను. చదివేసి వెంటనే ట్రై చేయండి.

చల్లని వాతావరణంలో , వాన కాలంలో, లేదా జలుబు చేసినప్పుడు, నోటికి రుచిగా, గొంతుకు హాయిగా, వేడి వేడి క్యారేట్ జింజర్ సూప్ తయారు చేసుకోండి.
కావాల్సిన పదార్ధాలు
క్యారేట్ – 300 గ్రాములు
నీళ్లు – 800ml
బిర్యాని ఆకు – 1
వెల్లుల్లి – 5 రెబ్బలు
మిరియాలు – ½ టేబుల్ స్పూన్
అల్లం- 1/2ఇంచ్
ఉప్పు-తగినంత
నూనె – 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ – 1/4కప్పు
తయారీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టుకుని, నూనె వేడి చేసి, అందులో బిర్యాని ఆకు, వెల్లుల్లి, మిరియాలు, అల్లం ముక్కలు వేసి, మూడు నిముషాలు వేపుకోవాలి.
2.అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, క్యారేట్ ముక్కలు వేసి, కాసేపు వేగిన తర్వాత, అరలీటర్ నీళ్లు పోసి, మీడియం ఫ్లేమ్ పై, ముక్కలు ఉడకనివ్వాలి.
3.మెత్తగా ఉడికిన క్యారేట్‌ను, నీళ్లతో సహా, మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
4.మెత్తని క్యారేట్ పేస్ట్ ను, జల్లెడలో వేసి, వడకట్టుకోవాలి.
5.ఆ సూప్ లోకి, 300ml నీళ్లు పోసి, హై ఫ్లేమ్ పై మరగనివ్వాలి.
6.మరుగుతున్న సూప్ పైన, నురగను తీసి వేయాలి.
7.చివరగా ఉప్పు వేసి, బాగా కలుపుకుని, స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సెర్వ్ చేసుకోవడమే.

