Kitchenvantalu

Dondakaya Karam:దొండకాయ ఉల్లికారాన్ని ఇలా చేసి పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు

Dondakaya Karam: దొండకాయ ఉల్లికారాన్ని ఇలా చేసి పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..దొండకాయ కాయను అందరు ఇష్టపడి తినాలంటే..కాస్తా డిఫరెంట్ గా చేస్తేనే తప్ప దొండకాయ వైపు చూడరు. ఈ సారికి దొండకాయ కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
దొండకాయలు – ¼ kg
ఉల్లిపాయ – 1
కరివేపాకు – ½ కప్పు
కారం – 1 టీ స్పూన్
మెంతుల పొడి – ½ స్పూన్
జీలకర్ర పొడి – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – సిరపడా

తయారీ విధానం
1.ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి సన్నని ,పొడువాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.ముక్కలను ఒక గిన్నెలో వేసుకోని అందులోకి కారం,మిరియాల పొడి,ఉప్పు,మెంతి పొడి,జీలకర్ర పొడి,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి నూనె యాడ్ చేసి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
4.స్టవ్ పై బాండీ పెట్టుకోని నూనె వేడిచేసి అందులోకి ఉల్లిపాయ వేసి రంగుమారేవరకు వేపుకోవాలి.

5.ఇప్పుడు అందులోకి కరివేపాకు కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి.
6.బాగా కలుపుకోని మూతపెట్టి దొండకాయలను ఉడికించుకోవాలి.
7.మద్య మద్యలో కలుపూతూ దొండకాయ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి.
8.అంతే ముక్క ఉడికిందో చెక్ చేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే దొండకాయం కారం రెడీ.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."