Wheat Flour Biscuits : గోధుమ పిండి బిస్కెట్లను ఇలా చేస్తే.. ఒక్కటి కూడా మిగల్చరు.. మొత్తం తినేస్తారు..
Wheat Flour Biscuits: ఒవన్ అవసరం లేకుండా బిస్కేట్స్ కోసం మార్కెట్ కి పరుగెత్తకుండా,పిల్లలకోసం బెల్లంతో బిస్కేట్లు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 1 కప్పు
బొంబాయి రవ్వ – ½ కప్పు
కొబ్బరి పొడి – ½ కప్పు
బెల్లం – 1 కప్పు
ఢ్రై ప్రూట్స్
యాలకుల పొడి – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
1.బిస్కేట్స్ తయారు చేసుకోవడం కోసం బొంబాయి రవ్వను కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
2.ఇప్పుడు పాకం కోసం ప్యాన్ లో కప్పు బెల్లం వేసి అందులో 1 టీ స్పన్ నీళ్లు వేసి బెల్లం కరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
3.అందులోకి గ్రైండ్ చేసుకున్న రవ్వ,గోధుమ పిండి,కొబ్బరి,యాలకుల పొడి,డ్రై ఫ్రూట్స్ ఉప్పు వేసి కలుపుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి బెల్లం సిరప్ ,కరిగించిన నెయ్యి వేసి పిండిని కలుపుకోని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
5.కలుపుకున్న పిండిని రెండు బాగాలుగా తీసుకోని మందపాటి చపాతీలాగ వత్తుకోవాలి.
6.ఒక గిన్నె సాయంతో గుండ్రని ఆకారం చపాతిని కట్ చేసుకోని మిగిలిన పిండిని తీసివేయాలి.
7.బిస్కేట్స్ ని డీప్ ఫ్రై చేయడానికి నూనే వేడి చేసి తయారు చేసుకున్న బిస్కేట్స్ ని నూనెలో వేసి లోఫ్లేమ్ లో మాత్రమే రెండువైపులా కాల్చుకోవాలి.
8.కాల్చిన బిస్కేట్లను టిష్యూ పేపర్ పై వేసుకోవాలి.
9.చల్లాబడిన తర్వాత బిస్కేట్స్ గట్టిపడ్తాయి.
10. చల్లారిన బిస్కేట్స్ ని ఎయిర్ టైట్ కంటేనర్ లో వేసుకుంటే ఫ్రెష్ గా ఉంటాయి..


