Kitchenvantalu

Mixed vegetable paratha: అన్ని కూరగాయలతో.. రుచికరమైన మిక్స్డ్ వెజిటబుల్ పరాటా..

Mixed Veg parotha:వెజ్ పరాటా.. మార్నింగ్ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ రోజంత శరీరానికి శక్తినిచ్చే లా ఉండాలి. లంచ్ లోకి ,బ్రేక్ ఫాస్ట్ లోకి పిల్లలకి ,పెద్దవాల్లకి అందరి కోసం వెజిటెబుల్ పరాటా తయారు చేయండి.హెల్తీ అండ్ టేస్టీ గా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 3 కప్పులు
బంగాళ దుంపలు – 1 కప్పు
క్యారెట్ తురుము – 1 కప్పు
క్యాబేజి – ½ కప్పు
క్యాప్సికం – ½ కప్పు
కాలీఫ్లవర్ – ½ కప్పు
కొత్తిమీర – ½ కప్పు
కారం – 1 టీ స్పూన్
ఉప్ఉప -1 టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
జీలకర్ర పొడి – 1 టీ స్పూన్
నిమ్మరసం – 1 ½ టీ స్పూన్
నూనె – తగినంత

తయారీ విధానం
1.ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి ఉడికించిన బంగాళ దుంపలను తీసుకోవాలి.
2.అందులోకి క్యారెట్ ,క్యాప్సికం,క్యాబేజి,కాలిఫ్లవర్ ,కొత్తిమీర,కారం,ఉప్పు,ధనియాలపొడి ,జీలకర్ర పొడి నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి గోధుమ పిండి వేసి నెమ్మదిగా కలుపుకోవాలి.
4.పిండి మరింత సాఫ్ట్ గా ఉండటానికి నూనె యాడ్ చేసి మెత్తని ఉండగా తయారు చేసుకోవాలి.
5.ఇప్పుడు చిన్న ముద్దలుగా తీసుకోని పరాటాలు కావాల్సిన సైజులో తాల్చుకోవాలి.
6.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని పరాటాలను నెయ్యి వేసి కాల్చుకుంటే హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రెడీ.