Kitchenvantalu

బ్యాచిలర్స్ స్పెషల్: వంటరాని వారు కూడా చిటికెలో చేసే టేస్టీ ‘ఎగ్ దాల్ కర్రీ’

Egg Dal Curry:ఎగ్ దాల్ కర్రీ.. ఏ కర్రీకి వంకలు పెట్టినా ఎగ్ కర్రీ అంటే మాత్రం నో చెప్పకుండా తినేస్తారు. ఎగ్ కర్రీని ఒకే విదంగా కాకుండా పప్పుతో మిక్సి చేసి ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

బ్యాచిలర్స్ అయినా, వంట గదిలోకి కొత్తగా అడుగుపెడుతున్న వారైనా సరే.. సులభంగా, తక్కువ సమయంలో చేసుకోగలిగే బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ ‘ఎగ్ దాల్ కర్రీ’ (కోడిగుడ్డు పప్పు కూర). కష్టపడి రకరకాల కూరలు చేసే ఓపిక, సమయం లేనప్పుడు ఈ వంటకం మీకు పర్ఫెక్ట్ ఆప్షన్.

ఇంట్లో ఉండే సాధారణ దినుసులతోనే ఎలాంటి హడావిడి లేకుండా దీన్ని తయారు చేసుకోవచ్చు. పప్పులోని ప్రోటీన్, గుడ్డులోని పోషకాలు రెండూ కలిసి ఈ కూరను మరింత ఆరోగ్యకరంగా మార్చుతాయి.

వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ, రోటీల్లోకైనా ఈ ఎగ్ దాల్ కర్రీ కాంబినేషన్ అదుర్స్ అనిపిస్తుంది. వంట అస్సలు రాని వారు కూడా భలే చేశారే అనిపించుకునేంత రుచిగా ఉండే ఈ కోడిగుడ్డు పప్పు కూరను సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్ధాలు
పెసరపప్పు – ½ కప్పు
గుడ్లు -4
స్ప్రింగ్ ఆనియన్స్ -2 కప్పులు
పచ్చిమిర్చి – 5-6
కరివేపకు – ½ కప్పు
వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
పసుపు – ½ టీస్పూన్
జీలకర్ర – 1 స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా పెసరపప్పును అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి జీలకర్ర,ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.
3.ఉల్లిపాయలు వేగాక కరివేపాకు,పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోని నానబెట్టిన పెసర పప్పు యాడ్ చేసుకోవాలి.
4.మూతపెట్టుకోని పప్పును కాసే పు ఉడకనివ్వాలి.

5.ఇప్పుడు అందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
6.ఇప్పుడు అందులోకి ఉప్పు వేసి పావు కప్పు నీళ్లను కలిపి కొత్తిమీరవేసి బాగా ఉడుకుపట్టనివ్వాలి.
7.కూర ఉడుకుతున్న టైంలో మద్యలో ప్లేస్ చేసుకోని అందులోకి గుడ్లను కొట్టి పోసుకోవాలి.
8.గుడ్లను వెంటనే కదిలించ కుండా మూతపెట్టి కాసేపు ఉడకనివ్వాలి.
9.గుడ్డు కాస్త గట్టి పడ్డాక మూత తీసి కూర అంతటిని బాగా మిక్స్ చేసుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ దాల్ కర్రీ రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."