Kitchenvantalu

Instant Cabbage Idli:ఇన్‌స్టంట్ క్యాబేజి ఇడ్లీ..హెల్తీగా .. టేస్టీగా.. చాలా బాగుంటాయి

Cabbage Idli:క్యాబేజ్ ఇడ్లీ..సాదారణంగా పిల్లలు క్యాబేజి అంటే ఇష్టపడరు. కాని క్యాబేజీ ఎంతో ఆరోగ్య కరం.పిల్లలు ఇష్టంగా తినాలంటే క్యాబేజితో ఇడ్లీ చేసి చూడండి.తప్పకుండా నచ్చుతారు.

కావాల్సిన పదార్ధాలు
ఇడ్లీ పిండి – తగినంత
క్యాబేజ్ – పిండికి సరిపడా
మినపప్పు – 1 టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి – 2
ఉల్లిపాయలు – 1
పసుపు – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.క్యాబేజి ఇడ్లీ కోసం క్యాబేజిని ఫ్రై చేసుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేడి చేసి జీలకర్ర,ఆవాలు,మినపప్పు,శనగపప్పు,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి పసుపువేసి వేసుకోవాలి.
3.ఉల్లిపాయలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి తురిమిన క్యాబేజ్ తరుగు వేసి మూతపెట్టి ఐదునిమిషాలు ఉడికించాలి.
4.క్యాబేజి దగ్గర పడ్డాక అందులోకి కారం,ఉప్పు,ధనియాల పొడి వేసి నిమిషం పాటు వేపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
5.తయారు చేసుకున్న కూరను ఇడ్లీ పిండిలో కలుపుకోని ఐదారు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు ఇడ్లా ప్లేట్స్ లో ఆయిల్ అప్లై చేసి క్యాబేజి తో కలిపిన ఇడ్లీ బ్యాటర్ ని వేసుకోవాలి.
7.తర్వాత మీడియిం ఫ్లేమ్ పై పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి.
8.తయారు చేసుకున్న ఇడ్లీలను సర్వ్ చేసుకోవడమే.