Munagaku paratha:రోజు తినే చపాతీకి బదులు.. ఈ ఒక్క ఆకుతో ‘పరాటా’ చేసి చూడండి,
Munagaku paratha:మునగాకు పరాటా..మునగ యొక్క ప్రయోజనాలు అందరికి తెల్సిందే.మునగ కాయలు,ఆకులు ,రెండు ఆరోగ్యాన్నిస్తాయి. ఐరన్, క్యాల్షియంలకు కేరాఫ్ అడ్రస్ మన మునగాకు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా రాత్రి డిన్నర్ లో నార్మల్ రోటీకి బదులుగా ఈ ‘మునగాకు పరాటా’ తింటే షుగర్ కంట్రోల్ అవ్వడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఎముకల బలానికి, రక్తహీనత తగ్గించడానికి మునగాకు దివ్యౌషధం. రోజూ రొటీన్ గా తినే చపాతీలకు బదులుగా, విటమిన్లు నిండిన మునగాకు పరాటాను ఎంతో రుచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు.
మునగాకు తో పరాటా చాలా హెల్తీ ఈ సారీ ట్రై చేయండి.
స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే ‘పల్లీ పట్టీ’.. ఈ సీక్రెట్ టిప్స్ పాటిస్తే ఇంట్లోనే ఈజీగా..!
తెల్ల జుట్టుతో విసిగిపోయారా? పెరుగులో ఈ పొడి కలిపి రాస్తే నిగనిగలాడే నల్లటి కురులు మీ సొంతం!!
కావాల్సిన పదార్ధాలు
మునగాకు – 1 కప్పు
గోధుమ పిండి -2 కప్పులు
ఉప్పు – 1 స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
వాము – ¼ టీ స్పూన్
పచ్చిమిర్చి – 2
పసుపు – ¼ టీ స్పూన్
ధనియాల పొడి – ½ స్పూన్
కారం – ½ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ స్పూన్

తయారీ విధానం
1.కప్పు గోధుమ పిండికి కప్పు మునగాకులను యాడ్ చేసుకోవాలి.
2.అందులోకి ఉప్పు,వాము,జీలకర్ర,పచ్చిమిర్చి,పసుపు ,ధనియాల పొడి ,కారం ,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
3.కొద్దికొద్దిగా నీళ్లను వేస్తు పిండిని కలుపుకోవాలి.

4.కలుపుకున్న పిండిని పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
5.చిన్న చిన్న బాల్స్ లా చేసుకున్న పిండిని పొడి పిండి సాయంతో పరాటాలు గా వత్తుకోవాలి.
6.ప్యాన్ పై వేసి నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకుంటే మునగాకు పరాటా రెడీ.

