Palak Kofta:పాలకూరతో ఇలా పాలక్ కోఫ్తా కర్రీ చేసుకోండి.. సూపర్ గా ఉంటుంది
Palak Kofta:పాలక్ కోఫ్తా..రోటీ ,చపాతి ,రైస్ లోకి చాలా టేస్టీ గ్రేవి కర్రీ పాలక్ కోప్తా ఎప్పుడైనా ట్రై చేసారా. లేదంటే ఈ సారి చేసి చూడండి.
కావాల్సిన పదార్ధాలు
పాలకూర -1 కప్పు
బంగాళదుంపలు – 2
టమాటోలు – 2
జీడిపప్పులు – 5
ఉల్లిపాయ – 1
జీలకర్ర – ½ టీ స్పూన్
పచ్చిమిర్చి – 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 ½ టీ స్పూన్
పసుపు – 1 టీ స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
గరం మసాలా – ½ టీ స్పూన్
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
కొత్తిమీర – ½ కప్పు
శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
1.ముందుగా బంగాళదుంపలను ఉడికించి మాష్ చేసుకోవాలి.
2.టోమాటో లను ప్యూరీలా చేసుకోవాలి.
3.జీడిపప్పును కూడా చిక్కని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
4.ఇప్పుడ కోఫ్తాలు చేయడానికి స్టవ్ పై కడాయి పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి జీలకర్ర,పచ్చిమిర్చి తరుగు,అల్లం వెల్లుల్లి పేస్ట్,తరిగిన పాలకూర వేసి ఫ్రై చేసుకోవాలి.
5.ఫ్రై చేసుకున్న పాలకూరను చల్లారనివ్వాలి.
6.ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి బంగాళదుంప తురుము,వేయించి పెట్టుకున్న పాలకూర,కొత్తిమీర,ఉప్పు,శనగపిండి,పసుపువేసి మిశ్రమాన్ని ముద్దగా కలుపుకోవాలి.
7.అరచేతులకు నూనే రాసుకోని ఆలు మిశ్రమాన్ని చిన్న బాల్స్ లా తయారు చేసుకోవాలి.
8.డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి లో ఫ్లేమ్ పై కోఫ్తాలను ఫ్రై చేసుకోవాలి.
9.ఇప్పుడు గ్రేవీ కోసం కడాయిలో నూనే వేడి చేసి అందులోకి ఉల్లిపాయ తరుగు ,పచ్చిమిర్చి ముక్కలు,అల్లం వెల్లుల్లి పేస్ట్,పసుపు ,వేసి కలుపుకోవాలి.
10.ఇప్పుడు అందులోకి టమాటో ప్యూరి వేసి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి.
11.నూనె పైకి తేలాక జీడిపప్పు పేస్ట్ నివేసి కలుపుకోవాలి.
12.ఒక నిమిషం ఉడికించాక అందులోకి కారం,ఉప్పు,ధనియాల పొడి,జీలకర్ర పొడి,వేసి తగినన్ని నీళ్లుపోసి ఉడికించాలి.
13.ఇప్పుడు గరం మసాలా,కొత్తిమీర తరుగు వేసి ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తాలను వేసి కలుపుకోని పది నిమిషాల పాటు లోఫ్లేమ్ పై ఉడకించుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలక్ కోఫ్తా రెడీ.


