Kitchenvantalu

Instant Rava Dosa:కేవలం 10 నిమిషాల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి రవ్వ దోస ఇలా ట్రై చేయండి

Instant Rava Dosa:ఇన్ స్టెంట్ రవ్వ దోశ..ఇంట్లో ఏ టిఫిన్స్ లేనప్పుడు, తక్షణంగా తయారు చేసుకునే, రెసిపీ ఇన్ స్టెంట్ రవ్వ దోశ.అచ్చం హోటెల్ స్టైల్ లాగా రవ్వ దోశను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బొంబాయి రవ్వ – 1 కప్పు
బియ్యం పిండి – 1 కప్పు
మైదా – 1/2కప్పు
ఉప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.ఒక పాన్ తీసుకుని,అందులో బొంబాయి రవ్వ, బియ్యం పిండి వేసి 5 నిముషాలు వేయించుకోవాలి.
2. వేయించుకున్న పిండి మిశ్రమంలోకి ఉప్పు వేసి, చల్లారనివ్వాలి.
3.ఈ మిశ్రమాన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిలువ చేసుకుంటే, రెండు నెలల వరకు, ఫ్రెష్ గా ఉంటుంది.

ఇప్పుడు ఇన్ స్టెంట్ రవ్వదోశ ఎలా చేసుకోవాలో చూద్దాం.
1.ఒక మిక్సింగ్ బౌల్ లోకి తయారు చేసి పెట్టుకున్న, రవ్వ మిక్సింగ్ ఒక కప్పు తీసుకుని, దానికి హాఫ్ కప్పు పెరుగును కలుపుకోవాలి.
2.కొద్దికొద్దిగా నీళ్లను కలుపుతూ పిండిని పలచగా, కలుపుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని, కొద్దిగా నూనె యాడ్ చేసి, రవ్వ దోశను, పెనం మొత్తానికి చల్లు కోవాలి.
4. రెండు మూడు నిముషాలు హై ఫ్లేమ్ పై వేగనివ్వాలి.
5.దోస బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత, మరో వైపుకు టర్న్ చేసుకోవాలి.
6.ఇప్పుడు దోశపై తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిచ్చి అల్లం ముక్కులు వేసి, మరికాసేపు వేపుకోవాలి.
7.ఆ పై నూనే కాస్త్ నూనే కాని నెయ్యి కాని వేసి సెర్వ్ చేసుకోవడమే.