Kitchenvantalu

Bobbatlu:నేతి బొబ్బట్లు పర్ఫెక్ట్ గా స్వీట్ షాప్ లోలా చేయాలంటే ఇలాచేయాల్సిందే

Bobbatlu: బొబ్బట్లు..ఉగాది పండక్కి ప్రతి తెలుగింట్లో చేసుకునే నేతి బొబ్బట్లు అంటే అందరు చాలా ఇష్టపడతారు.ఈజీగా ,టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
శనగపప్పు – 1 కప్పు
చక్కెర – 1 కప్పు
గోధుమ పిండి – 2 కప్పులు
యాలకుల పొడి – 1 టీ స్పూన్
డ్రై ఫ్రూట్స్ – 1 టేబుల్ స్పూన్
నెయ్యి – బొబ్బట్లు కాల్చడానికి
కొబ్బరి పొడి – ఆఫ్షనల్

తయారీ విధానం
1.ముందుగా శనగపప్పు ను కడిగి కుక్కర్లో వేసి రెండు కప్పుల నీళ్లను పోసుకోని మూడు,నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
2.ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి గోధుమ పిండిని వేసుకోని చిటికెడు ఉప్పు యాడ్ చేసి కొద్ది కొద్దిగా నీళ్లను వేస్తు చపాతి పిండిలా కలుపుకోవాలి.
3.కలుపుకున్న పిండికి ఆయిల్ అప్లై చేసి పిండిని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు ఉడికిన పప్పును వడకట్టుకోని పప్పును మెత్తగా మెదుపుకోవాలి.
5.ప్యాన్ లో వేసి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకోని అందులోకి బెల్లం,లేదా చక్కెర వేసి కలుపుకోవాలి.

6.అందులోకి డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడిని వేసి మిశ్రమం చిక్కపడే వరకు కలుపుతూ ఉండాలి.
7.ఇప్పుడు పప్పు కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోని చల్లారనివ్వాలి.
8.ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతి పిండిని ముద్దలుగా చేసుకోని చపాతిలను తాల్చుకోవాలి.
9.అరచేతిలో నూనె వేసి చపాతిలోకి పప్పు మిశ్రమాన్ని బంతిలా పెట్టటి పిండితో మూసివేసి అదనపు పిండిని తొలగించాలి.
10.ప్లాస్టిక్ కవర్ పై ఆయిల్ వేసుకోని బొబ్బట్లను స్టఫ్ బయటకు రాకుండా నెమ్మదిగా తాల్చుకోవాలి.
11.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని వేడెక్కిన ఆయిల్ కాని నెయ్యి కాని వేసి బొబ్బట్లను దోరగా కాల్చుకుంటే బొబ్బట్లు రెడీ అయినట్టే.