Kitchenvantalu

నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే వెన్న మురుకులు.. ఈ చిన్న ట్రిక్‌తో చేస్తే గుల్లగా, కరకరలాడుతూ వస్తాయి!

పండుగలు, శుభకార్యాలు లేదా సాయంత్రం వేడి వేడి టీతో తినడానికి సంప్రదాయ పిండివంటల్లో వెన్న మురుకులు (Butter Murukku) ఎప్పుడూ ప్రత్యేకం. సాధారణ జంతికల కంటే ఇవి చాలా మృదువుగా, గుల్లగా ఉంటూ నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే అద్భుతమైన రుచితో ఉంటాయి. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.

అయితే చాలామందికి వెన్న మురుకులు చేసేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చడం లేదా గట్టిగా రావడం జరుగుతుంటుంది. బియ్యప్పిండి, శనగపిండి, వెన్న కొలతలు కరెక్ట్‌గా ఉంటే ఎలాంటి శ్రమ లేకుండా మొదటిసారైనా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు.

నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ కమ్మని వెన్న మురుకుల పూర్తి తయారీ విధానం, పిండి కలిపే పద్ధతి మరియు నూనెలో వేయించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలను ఈ పోస్ట్‌లో చూద్దాం. కొన్ని తినుబండారాలను, సమయం సందర్భం అవసరం లేదు. ఆకలి, అంతకన్నా అవసరం లేదు. మొదలు పెడితే తింటూనే ఉంటాం.ఈవినింగ్ స్నాక్స్ కోసం, వెన్న మురుకులు ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం పండి – 3 కప్పులు
తెల్ల వెన్న – 80 నుంచి 100 గ్రాములు
ఉప్పు – రుచికి సరిపడా
నువ్వులు – 2 టీ స్పూన్స్
వాము – 1 టీ స్పూన్
నీళ్లు – 425 ml
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులోకి బియ్యం పిండి, వెన్న వేసి, బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత మిగిలిన పదార్ధాలు వేసి, కలుపుకోవాలి.
3. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకుంటూ, పిండిని మెత్తగా, ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, నూనెను వేడి చేసుకోవాలి.
5. ఇప్పుడు కలుపుకున్న పిండిని, మురుకుల మిషన్ లో నింపుకుని, వెడెక్కిన నూనెలోకి వత్తుకోవాలి.
6. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి, లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు, కాల్చుకుని, బయటికి తీసుకోవాలి.
7. చల్లారిన తర్వాత, ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే 15 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."