Kitchenvantalu

బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బ్రౌన్ రైస్‌తో ఇలా కిచిడీ చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!

Brown Rice Khichdi;బ్రౌన్ రైస్ కిచిడి.. డైట్ లో భాగంగా చాలా మంది రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ వాడుతున్నారు. బ్రౌన్ రైస్ తో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా (Weight Loss) వైట్ రైస్‌కు బదులు బ్రౌన్ రైస్ తినమని వైద్యులు చెబుతుంటారు. కానీ, బ్రౌన్ రైస్ వండుకుని తినడం చాలామందికి నచ్చదు. అలాంటి వారు బ్రౌన్ రైస్‌తో కమ్మటి కిచిడి (Brown Rice Khichdi) చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే ఈ కిచిడీని తీసుకుంటే పొట్ట త్వరగా నిండటమే కాకుండా, శరీరానికి కావాల్సిన పూర్తి ఎనర్జీ అందుతుంది. ముఖ్యంగా డైట్ చేసేవారికి, షుగర్ పేషెంట్స్‌కి బెస్ట్ ఆప్షన్ అయిన ఈ టేస్టీ బ్రౌన్ రైస్ కిచిడీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో చూసేయండి!

కావాల్సిన పదార్ధాలు
బ్రౌన్ రైస్ – 2 కప్పులు
కంది పప్పు – 1 కప్పు
ఉడికించిన పచ్చి బఠానీలు – ½ కప్పు
క్యారేట్ – ½ కప్పు
టొమాటో- ½ కప్పు
బంగాళదుంప – ½ కప్పు
క్యాప్సికం – ½ కప్పు
పచ్చిమిర్చి – 4
ఉల్లిపాయలు – ½ కప్పు
కొత్తిమీర – ½ కప్పు
పుదీనా – ½ కప్పు
ఓల్ గరంమసాలా – రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా బ్రౌన్ రైస్ ని,కంది పప్పుని గంట పాటు నానబెట్టుకోవాలి.
2.ఇప్పుడు కుక్కర్ లోకి నెయ్యి వేసి వేడెక్కాక అందులోకి ఓల్ గరం మసాలా వేసి వేపుకోవాలి.
3.మసాలా వేగాక పచ్చిమిర్చి ,ఉల్లిపాయలు,వేసి మెత్తపడే వరకు వేపుకోవాలి.
4.ఉల్లిపాయలు వేగాక పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్,బఠానీ,క్యారేట్,క్యాప్సికం,బంగాళదుంప ముక్కలు వేసి రెండు,మూడు నిమిషాలు వేపుకోవాలి.

5.ఇప్పుడు టమాటో ముక్కలు వేసి మెత్తపడే వరకు ఉడికించాలి.
6.టమాటోలు మెత్తపడ్డాక బ్రౌన్ రైస్ ,కందిపప్పును వేసి కలుపుకోవాలి.
7.అందులోకి పుదీనా కొత్తిమీర ఆరు కప్పుల నీళ్లను పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
8.కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే.
“Brown rice khichdi recipe in telugu, healthy weight loss recipes telugu, brown rice benefits, diet food recipes in telugu, brown rice khichdi for weight loss, diabetes friendly recipes, బ్రౌన్ రైస్ కిచిడి, బరువు తగ్గించే ఆహారం, హెల్తీ రెసిపీస్.”

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."