Kitchenvantalu

Pesarattu:పెసరట్టుకి పిండి ఇలా వేసుకుంటే హోటల్ లో కంటే చాలా రుచిగా ఉంటాయి

Pesarattu:పెసరట్టు..తెలుగు వారి ఫేవరేట్ టిఫిన్ పెసరట్టు.ఎంతో ప్రోటీన్ కంటెంట్ ఉండే పెసరట్టు ఆరోగ్యానికి కూడ చాలా మంచిది.

కావాల్సిన పదార్ధాలు
పెసలు – 1 కప్పు
బియ్యం – ¼ కప్పు
పచ్చిమిర్చి – 4
జీలకర్ర – 1 టీ స్పూన్
అల్లం – చిన్న ముక్క

తయారీ విధానం
1.పెసలు,బియ్యాన్ని నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2.నానిన పెసలను గ్రైండ్ చేసుకోవాలి.
3.అందులోనే అల్లం ,పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు.
4.గ్రైండ్ చేసుకున్న పిండిని వేరొక గిన్నెలోకి ట్రాన్సఫర్ చేసుకోని తగినన్ని నీళ్లను యాడ్ చేసి దోశ కన్ సిస్టెన్సీ లో తయారు చేసుకోవాలి.
5.అందులోకి జీలకర్ర వేసి కలుపుకోవాలి.
6.స్టవ్ పై దోశ ప్యాన్ వేడిచేసుకోని గరిటడు పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి.
7.కాస్త వేగాక అవసరం అనుకుంటే ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి ,కొత్తిమీర తరుగు వేసుకోవచ్చు.
8.అంచులకు నెయ్యి,లేదా నూనె వేసి పెసరట్టును ఎర్రగా కాల్చుకోవాలి.
9.అంతే వేడి వేడి పెసరట్టు రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."