Devotional

కొత్త సంవత్సరం మొదటి రోజు ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది

2024 సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1 సోమవారం అయింది. ఈ రోజు శివునికి పూజ చేసి శివునికి సంబంధించిన మూడు వస్తువులను ఇంటికి తీసుకువస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సోమవారం శివునికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు చాలా మంది భక్తులు శివపార్వతులను పూజించి ఉపవాసం చేస్తారు.

ఇలా చేయడం వలన ఇంట్లో సంతోషం, సౌభాగ్యం కలగడమే కాకుండా కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకం. ఇప్పుడు ఇంటికి తీసుకువచ్చి puja చేయవలసిన వస్తువుల గురించి తెలుసుకుందాం.

డమరుకం
ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి శివునికి ఎంతో ఇష్టమైన డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఆ రోజు శివపార్వతులకు పూజ చేసి డమరుకాన్ని అన్ని గదులలో వాయించండి. ఇలా వాయించడం వలన నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

శివ లింగం
శివుని ఆశీస్సులు పొందాలంటే కొత్త సంవత్సరం మొదటి రోజున శివలింగం ఇంటికి తీసుకువచ్చి నియమాల ప్రకారం పూజ చేయాలి. శివలింగాన్ని ఇంటిలో ప్రతిష్ట చేయడం వలన జీవితంలో దోషాలు అన్ని తొలగిపోతాయి. అయితే శివలింగం ఇంటికి తెచ్చుకుని విషయంలో ఒక నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి.

శివలింగం రెండు అంగుళాలకు మించి ఉండకూడదు. ఒకవేళ రెండు అంగుళాలకు మించి ఉంటే ప్రతి రోజు ధూప దీప నైవేద్యాలు తప్పనిసరిగా పెట్టాలి. అలా కుదరని వారు శివలింగాన్ని సంవత్సరం మొదటి రోజు సోమవారం ఇంటికి తీసుకువచ్చి పూజ చేసి బుధవారం అంటే జనవరి మూడో తేదీన ఏదైనా గుడిలో ఇవ్వవచ్చు.

త్రిశూలం
ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు వాటి నుంచి బయటపడాలంటే కొత్త సంవత్సరం మొదటి రోజున త్రిశూలం ఇంటికి తీసుకువచ్చి పూజ చేయాలి. ఇంట్లో త్రిశూలం ఉండటం వలన ఆదాయం, అదృష్టం పెరుగుతాయని ఒక నమ్మకం. అలాగే ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."